Home Astrology శ్రీ ప్లవ నామ సంవత్సర మిథునరాశి ఫలాలు (2021-22)

శ్రీ ప్లవ నామ సంవత్సర మిథునరాశి ఫలాలు (2021-22)

38
0
Gemini horoscope 2021-2022

మిథున రాశి ఫలితములు

మృగశిర 3,4 పాదములు (కా, కి)
ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే, కో, హా)
ఆదాయం-5 వ్యయం-5 రాజయోగం-3 అవమానం-6

ఈ శ్రీ ప్లవ నామ సంవత్సరంలో గురువు ఏప్రిల్ (5) నుండి సెప్టెంబరు (14) వరకు మరియు నవంబరు (20) నుండి శ్రీ ప్లవ నామ సంవత్సరాంతం వరకు కుంభంలో (భాగ్యం) సంచరించి మిగిలిన కాలములో అంతయు మకరరాశి (అష్టమం)లో సంచరించును. శని సంవత్సరంలో అంతయులో మకరంలో (అష్టమం) సంచరించును. రాహువులో వృషభంలో (వ్యయం) కేతువు వృశ్చికంలో (షష్ఠం) సంచరించెదరు. ఈ సంవత్సరంలో అధిక కాలము భాగ్యంలో వుండే గురుగ్రహము అనుకూలములో వలన కాలము నడుచును. మిగిలిన రోజులలో గ్రహచారం మాస వారి గోచార గ్రహాలులో రవి శుక్ర బుధుల సంచారం వలన కొంత ఉపశమనం కలుగును.

మీ యొక్క గత సంవత్సరాలలో జరిగిన నష్టాలకు ఈ సంవత్సరంలో మీరు పునరాలోచనలు చేసి ఎంత పొరపడ్డామో! అని బాధపడే కాలము. మీరు ఎవరితోను అధికంగా చర్చలులో సాగించవద్దు అని ప్రత్యేక సూచన. లాభించే పనులులో ఉన్ననూ లేకున్ననూ మీరు ఏదో ఒక వ్యాపకంతో కాలక్షేపం చేయడం శ్రేయస్కరం. రోజువారీ పనులులో అస్తవ్యస్తంగా నడుచును. నమ్మదగనిలో వారిని నమ్మడం. నమ్మదగినవారిని నమ్మకపోవడంలో వంటివి చేసి ఈ సంవత్సరం యింకా కొత్త కొత్త చికాకులు పొందుతూనే ఉంటారు. ఉద్యోగస్తులకు ఏ పనిలో చేసినా గుర్తింపు రాకపోవడంతో అదేరీతిగా మీరు కూడా ఉద్యోగ రీత్యా తోటివారితో యిబ్బందులకు గురి అవ్వడం వంటివి జరుగుతాయి.

గురువులో కుంభంలో ఉండగా కొంతవరకు ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూలంగా వచ్చినా అది సాధారణమే. కుంభంలో గురువు సంచారం మీకు వృత్తిలో విషయాలలో నష్టాలులో నివారిస్తుంది. కానీ లాభాలులో యివ్వదు. వ్యాపారులకు ఆశించిన రీతిలో లాభాలులో వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. సహజంగా అష్టమంలో శనిలో సంచారం చేస్తున్నకాలంలో అన్ని కార్యములలోను కలహములులో ఉత్పత్తి అవుతుంటాయి. అయితే ఈ రాశివారికి గురువు కుంభంలో సంచారంలో చేయు కాలం అంతా రక్షణగా చేస్తుంటారు. అనవసర భయాందోళనలులో పెరుగుతాయి. అనవసరంగా అగ్ని, చోర, రాజభయములకు గురి అయ్యే అవకాశంగా ఉన్నది.

ఏప్రిల్, మే నెలల్లో చికాకులులో సానుకూలంగా అవుతాయి. ఈ స్థితిలో ఆర్థిక లావాదేవీలులో మీ మనోధైర్యం పాడు చేయు అవకాశంగా గోచరిస్తుంది. మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే కాలములో ఈ సంవత్సరం ఎక్కడా గోచరించదు. విచిత్రం ఏమిటి అంటే ఈ సంవత్సరంలో మీరు ధైర్యంగా ఎదుర్కొనే ప్రతివిషయంలోను, మీరు ప్రత్యక్షంగా పాల్గొనే పనులకు గాను సానుకూల స్థితివుంటుంది. ఎవరి మీద అయినా ఆధారపడితే గానీ ఆ కార్యములు చికాకులను చూపుతాయి. సంవత్సరాంతంలో కొన్ని కొత్త కొత్త పరిచయాలను భవిష్యత్తుకు ఉపయోగించేవిగా కలుగుతాయి. విద్యా విషయముగా విదేశాలకు వెళ్ళేవారికి కుంభంలో గురువులో వుండగా కాలం అనుకూలం.

మకరంలో గురువుగా వుండగా విదేశీ ప్రయాణంలో ఆలోచనలు ఏమీ చేయకుండా ఉంటే మంచిది. కన్స్ట్రక్షన్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వారు చాలా చికాకులును పొందుతారు. ఫైనాన్స్ వ్యాపారులులో అధికైన జాగ్రత్తలు పాటింపవలసిన కాలము. మొండిబాకీలు కూడా పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు వస్తువులులో నిల్వచేసి వ్యాపారంగా చేయువారికి వ్యాపార విధానాలను అంచనా వేయు విషయంలో అనుకూలంగా కుదరక మకరంలో గురు సంచారం కాలంలో నష్టాలును పొందే అవకాశంగా ఉన్నది. శుభకార్య ప్రయత్నాలలో వున్నవారికి కుంభంలో గురువులో ఉండగా సత్ఫలితాలు అనేవి అందుతాయి. అదేరీతిగా కుంభ గురువుగా పుణ్యక్షేత్ర సందర్శన, గురువులను పూజ్యులను సందర్శింప చేయు విధంగాను అనుకూలిస్తారు.

విద్యార్థులులో తరచుగా నిగ్రహం కోల్పోయేలా స్థితిలో ఉంటారు. వారికి కుంభంలో గురువుగా వున్న కాలములో అనుకూలముగా ఉంటుంది. రైతులకు జాగ్రత్తలులో తీసుకోవలెనని ప్రత్యేక సూచన. కోర్టులో వ్యవహారములలో వున్నవారికి మోసపూరితంగా వాతావరణం వెనుకనే ఉంటుంది. ఏ పనీ సవ్యంగానే సాగదు. అందరూ నమ్మించి మోసం చేయడం పనులులో ఆలస్యం అవడం వంటివి ఉంటాయి. జాగ్రత్తగా పడవలసిన కాలము. స్థానచలనంలో ప్రయత్నాలలో వున్నవారికి యిబ్బందికర ఘటనలు కూడా ఎన్నో ఎదురౌతాయి.

స్థిరాస్తి కొనుగోలులో ప్రయత్నంలో వున్నవారికి మీ ప్రయత్నాలనేవి వలన బంధువులతో సన్నిహితులతో మంచి సలహాలుగా అందకపోగా కలహాలు సమస్యలకు సంబంధించినవి ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలులో చేసినా ఉపయోగంగా ఉండదు. రావలసిన ప్రమోషన్లు అనేవి కూడా అందవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి అనుకూలంలో తక్కువ. చేస్తున్న ఉద్యోగంలో వదిలి కొత్తది వెతకవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలులో కుంభంలో గురువు వుండగా సంవత్సరం చివర్లో అనుకూల స్థితి అనేది ఉంటుంది.

కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చికాకులులో తరచుగా రాగలవు అయితే కొన్ని సందర్భాలలో ముందు జాగ్రత్తలులో పాటించి మంచి ఫలితాలు కూడా తీసుకుంటారు. సహజంగా పిల్లల విషయంలో కూడా సంతృప్తికరమైన ఫలితాలులో అందవు. భార్యాభర్తల మధ్యలో అనుకూల స్థితి తక్కువగానే ఉంటుంది. బంధువులలో రాకపోకలు అధికము. అయితే బంధువులులో జ్ఞాతుల వలన అనవసర కలహములులో ఉంటాయి.

రుణ విషయంలో పాత రుణములులో వున్నవారికి యిబ్బందులు అనేవి అవమానములులో రావడం. మకరంలో గురువులో వున్నకాలంలో అవసరానికి తగిన కొత్త రుణములు అందకపోవడం వంటివి చికాకులులో ఉంటాయి. ఆరోగ్య విషయంలో మానసిక ఆరోగ్య సమస్యలులో వున్నవారికి మరియు నేత్ర సంబంధమైన అనారోగ్యములులో వున్న వారికి తరచుగా చికాకులు వచ్చే అవకాశంగా ఉంటుంది. గురువులో మకరంలో సంచారం చేయుకాలంలో యిబ్బందులులో శారీరకంగా ఎక్కువ ఉంటాయి. మిగిలిన కాలంలో అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లులో పూర్తికావు. యిది ఒక పెద్ద చికాకులను సృష్టించేది కాలమే. పైన చెప్పిన అన్ని అంశాలలో కుంభంలో గురువులో సంచరించే కాలములులో అనుకూల స్థితి ఉంటుంది.

స్త్రీలకు ఈ సంవత్సరంలో శారీరకంగా యిబ్బందులులో పెరిగే అవకాశం ఎక్కువ. గురువు కుంభంలో సంచారంగా చేయుకాలంలో కొన్ని ఉద్యోగ వ్యాపార అంశాలులో అనుకూలంగా అవుతాయి. కుటుంబంలో ఉద్యోగంలో విషయాలను సమతూకంగా నడపలేరు. గౌరవ మర్యాదలకు యిబ్బందులులో రాకుండా జాగ్రత్తగా పడండి. శని రాహు ప్రభావంగా గర్భిణీ స్త్రీలులో యిబ్బందులును ఎదుర్కొంటారు. రోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రం దుర్గా సప్తశ్లోకీ పారాయణం చేయండి.

మృగశిర నక్షత్రంలో వారికి విశేషములు ఏమనగా కోర్టు వ్యవహారములులో స్థిరాస్తి వ్యవహారములు, జ్ఞాతి కలహములులో ఉన్నవారికి యిబ్బందులులో పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు యిబ్బందికరం. ఆరోగ్య స్థితి చికాకులులో సృష్టించేదిగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి విశేషములులో ఏమనగా తెలివిగా జీవనం చేస్తారు. ద్వితీయార్థం చాలావరకు సానుకూలంగానే ఉంటుంది. అందరితో సహాయ సహకారములు పొందుతూ అన్నింటిలోను విజయంతో సాధిస్తూ ఆనందకరంగా జీవనం చేస్తారు. పునర్వసు నక్షత్రం వారికి విశేషములులో ఏమనగా విజ్ఞాన వినోద కార్యములు మీద దృష్టి అధికంగానే సాగిస్తారు. రోజువారీ పనులులో సరిగా సాగవు. అవసరమైన కార్యములలో కూడా దృష్టి అనేది కేంద్రీకరించరు. వీలైనంతవరకు విలాసవంతంగా జీవితం గడుపుతారు.

నిత్యం పఠింపవలసిన స్తోత్రం :

“మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన – శత్రూన్ సంహారమాంరక్ష శ్రియం దాపయమే ప్రభో”

ఈ శ్లోకం తరచుగా పఠించడం వలన అష్టమ శని ప్రభావంగా రావలసిన కలహములు నివారింపబడి సుఖపడతారు.
శాంతి : దోషము చేయు గ్రహములు శని రాహు నిమిత్తంగా జూలై మాసములో జపదాన హోమ శాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. త్రిముఖ రుద్రాక్షధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. రోజూ శ్రీరామశ్శరణం మమ అని చెబుతూ ఆంజనేయస్వామి దేవాలయంలో 11 ప్రదక్షిణలు చేసి అక్కడే ఉండి సంక్షిప్త రామాయణం పారాయణం చేయండి.

ఏప్రిల్ : అన్ని కోణాలలోను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తగు లాభాలు అందుకోవడం జరుగుతుంది. సమస్యలు దాటవేయు ప్రయత్నాలు చక్కగా చేసి కృతకృత్యులు అవుతారు. ఋణాలు తీర్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆశించిన రీతిగా ఫలితాలు ఉండవు. అయితే నష్టం లేకుండా సాగిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు అన్ని విషయాలలోనూ బాగుంటుంది. ఖర్చులు నియంత్రించగలుగుతారు.

మే : ప్రతిపనీ స్వయంగా చేసుకోండి. క్రమంగా మాసాంతంలో యిబ్బందులు పెరిగే అవకాశములు ఎక్కువ అవుతాయి. అన్ని విషయాలలో ప్రశాంతంగా ఆలోచించి చేయాలి. వ్యాపారస్తులు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ తొందరపాటు ధోరణి విడనాడాలి. మీ యొక్క ప్రతి అంశం లాభ దాయకంగా ఉంటుంది. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా కలహాలకు దూరంగా ఉండండి. ప్రయాణ విషయాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబంలోని పెద్దలను ప్రయాణం చేయించవద్దు.

జూన్ : అంతా శ్రమయుక్తమే అయినా లాభదాయకం అని చెప్పాలి. ఆరోగ్య పరిరక్షణ మీద బాగా దృష్టి కేంద్రీకరించడం చాలా అవసరం. వాహనాలు కొనుగోలు ప్రయత్నంలో ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో ఉన్నవారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. కార్యసానుకూలత అన్ని విషయాలలోనూ ఉంటుంది. ధనవ్యయం లేకుండా ఏ పనీ సాగదు. బంధువులు, మిత్రులు మీకు మంచి సూచనలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో వాటిని పెడచెవిని పెట్టి కొన్ని స్వతంత్ర్య నిర్ణయాల వలన ఇబ్బందులు పొందే అవకాశం ఉంటుంది.

జూలై: భార్యాపుత్రల సహాయ సహకారములు అనుకూలంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలకు యిబ్బంది లేకుండా చూసుకోండి. ఋణ వ్యవహారములు జాగ్రత్త. ఋణములు ఇచ్చిన చోట నుండి ఇబ్బందికరమైన సందర్భాలు గోచరం అవుతాయి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కోణాలలో సమస్యలు, కొన్ని కోణాలలో శుభవార్తలు, మంచిజీవనం సాగుతూ ఉంటుంది. ఆర్థికలావాదేవీలు మీ పరిధిలో ఉండవని తెలుసుకోండి.

ఆగష్టు: ధనవ్యయం అధికం అవుతుంది. అంతేకాకుండా వృత్తి విషయంలో అధికారుల నుండి ఒత్తిడి అధికం అవుతుంది. కొంత ప్రశాంతత తగ్గుతుంది. వృత్తి విషయాలలో ప్రతిపనీ ఆలస్యం అవ్వడం తద్వారా అధికారుల నుండి సమస్యలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. మీ ధోరణి బాగా నియంత్రించుకోవాలి. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో, పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో మీరు ఆశించిన రీతిగా ఫలితాలు ఉండవు. కుటుంబ అవసరాలు తీర్చే ప్రయత్నంలో మీరు సమయపాలన చేయక కొంచెం చికాకులుకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది.

సెప్టెంబర్ : యిబ్బందికరమైన సందర్భాలు ఏమీ ఉండవు కానీ కొంత శ్రమ, చికాకు పొందుతారు. దూరప్రాంత ప్రయాణాలు చేయవద్దు. వాహనాలు నడిపే విషయంలో గాయములు అయ్యే అవకాశం ఉంటుంది. పనిముట్లు వాడకంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహోపకరణ, అలంకరణ వస్తు కొనుగోలు విషయంలో ధనవ్యయం బాగా జరుగుతుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే ప్రయత్నంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలకు తగిన గుర్తింపు రాకపోవడం అనేది జరుగుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నాలలో చికాకులు ఉంటాయి.

అక్టోబర్ : చాలా విచిత్రమైన కాలము. ఎప్పుడూ అనుకూల స్థితి ఉంటుందో ఎప్పుడు ప్రతికూల స్థితి ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీ వర్కర్స్, మీ తోటివారు మీకు ఇచ్చే ప్రోత్సాహం చాలా అద్భుతంగా ఉంటుంది. సందర్భం లేకుండా కొన్ని కొన్ని విచిత్రమైన కలహాలు కూడా వస్తాయి. వ్యాపార లావాదేవీలు లాభదాయకం కావుకానీ, నష్టం మాత్రం ఉండదు. అలాగే ప్రతి విషయంలోనూ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు లేకుండా రోజులు గడిచిపోతూ ఉంటాయి.

నవంబర్ : సమస్యలు సరిచేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. ప్రతిపనిలోనూ ధనవ్యయం అధికం అవుతుంది. ఉద్యోగం బహు జాగ్రత్త వహించాలి. ఆదాయం సందర్భానుసారంగా అందకపోవడం, ఆశించిన వ్యక్తులు సరిగా సహకరించకపోవడం మీకు పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైనటువంటి ఘటనలను సూచిస్తుంటాయి. పుణ్యకార్య ప్రయత్నాలు శుభకార్య ప్రయత్నాలు తరచుగా చేస్తూ ఉంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇబ్బంది లేని జీవితాన్ని గడుపుతారు.

డిసెంబర్ : మీ మాటకు విలువ తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలలో మంచి ఫలితాలు అందే అవకాశం లేదనే చెప్పాలి. తొందరపాటు ధోరణి విడనాడండి. ఎవరి వ్యవహారములలోనూ కలుగచేసుకోవద్దు. ప్రత్యేకించి ప్రయాణాలు చేయవద్దని సూచన. మీ యొక్క ప్రతి అంశాన్ని మీరే స్వయంగా శోధిస్తే సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకు నిరుత్సాహం కలిగించేటటువంటి మీ నడవడి మీకు కలహాలను తీసుకువస్తుంది.

జనవరి : కష్టపడిన దానికి తగిన ఫలితం లాభదాయకంగా అందుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 15వ తేదీ నుండి జాగ్రత్తలు అధికంగా పాటించాలి. కుటుంబపరంగా అన్ని విధాల మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ధనవ్యయం మాత్రం అధికంగా ఉండడంతో తరచుగా మీరు కలహించే అవకాశం ఉంటుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు బాగా ఉంటాయి. అన్ని ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఫిబ్రవరి : గ్రహచారం బహు విరోధంగా గోచరిస్తున్నాయి. మీరు వృత్తి వ్యాపార విషయాలలో ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. గౌరవభంగం జరగకుండా చూసుకోండి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించక చాలా ఇబ్బందులు కొని తెచ్చుకొనే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు మీ మాట తీరును చాలా జాగ్రత్తగా సరిచేసుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం మీ జీవనశైలి మీద బాగా ఒత్తిడిని తీసుకువస్తుంది. ప్రతిపనీ ఆలస్యంతో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. పనిముట్ల వాడకంలో గాయములు అవ్వకుండా చూసుకోండి.

మార్చి : అవరోధములు అధికం అవుతాయి. యిబ్బందికర ఘటనలు ఎక్కువ అవుతాయి. అనారోగ్యవంతులు, ఋణములు వున్నవారు ఈ నెలలో యిబ్బందులకు ఎక్కువ గురి అవుతారు. వచ్చే ఆదాయానికి, చేసే ఖర్చుకు పొంతన ఉండదు. అభివృద్ధి పొందవలసిన చోట కూడా పనులు పూర్తవ్వక ఇబ్బంది పడతారు. మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చాలా గోప్యంగా ఉంచడం అలాగే వృత్తి విషయాలు స్వయంగా చూసుకోవడం కుటుంబ వ్యవహారాలలో కూడా ఎవరి మీదా ఆధారపడకుండా ఉండడం చాలా అవసరం.

Previous articleశ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాలు (2021-22)
Next articleశ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు (2021-22)