Home అంతర్జాతీయ వార్తలు మరో డేంజర్..ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి బర్డ్ ఫ్లూ

మరో డేంజర్..ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి బర్డ్ ఫ్లూ

201
0
First Human Case Of Bird FLu Identified In China

బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు సోకే వ్యాధి. ఇది పక్షుల్లో ప్రాణాంతకమైన వ్యాధి. ఇది కానీ సోకితే పక్షల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కోళ్లకు ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యాధి ఇప్పటి వరకూ మనుషులకు సోకలేదు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ వ్యాధి మనిషికి సోకింది. చైనాలో తూర్పు ప్రావిన్స్‌ ప్రాంతంలోని జెన్‌జియాంగ్‌ ప్రాంతంతో నివశించే వ్యక్తికి బర్డ్ ప్లూ వచ్చింది. ఆ వ్యక్తి వయసు 41 ఏళ్లు. ఈ విషయాన్ని స్వయానా చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తికి జ్వరము, మరికొన్ని లక్షణాలు కనిపించాయి. దీంతో అతను వైద్యచికిత్స కోసం ఏప్రిల్ 28న హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. 

వ్యాధుల గుర్తింపు నియంత్రణ మండలి అయిన సీడీసీ విభాగం మే 28వ తేదిన బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తికి టెస్టులు నిర్వహించింది. అందులో అతనికి బర్డ్‌ ఫ్లూ వచ్చినట్లు తేలింది. బాధితుడికి ఈ వ్యాధి ఏవిధంగా వచ్చిందనే విషయం తెలియరాలేదు. ఆ వ్యక్తిలో H10N3 రకానికి చెందిన ఏవియాన్ ఇన్‌ఫ్లూయెంజా అనేదాన్ని గుర్తించినట్లు తేలడంతో చైనా వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. వ్యాధి సోకిన వ్యక్తికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తోంది. ఆ వ్యక్తి ఈ మధ్య ఎవరెవరిని కలుసుంటాడో తెలుసుకుని వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. పౌల్ట్రీల్లో పనిచేసేవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read More: Latest National News in Telugu | Latest World News online | Telangana State News in Telugu

Previous articleఆ హీరోతో రోమాన్స్ చేసే ఛాన్స్..మనసులో మాట బయటపెట్టిన ప్రియమణి
Next articleఇంటి వద్దకే ఆనందయ్య మందు..ఆన్ లైన్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు