Home తెలంగాణ రేపే ముహూర్తం ఫిక్స్..ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా ?

రేపే ముహూర్తం ఫిక్స్..ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా ?

239
0
Etela Rajendar Ready To Resign As MLA On Friday
Etela Rajendar Ready To Resign As MLA On Friday

రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. అయితే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు మాత్రం ఎవరికీ అంతుచిక్కని విధంగా ఉంటాయి. తన ప్రత్యర్థులు ఊహించని విధంగా, వారి ఊహాలకు అందని విధంగా కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తుంటారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు ఏ రకమైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.

అయితే రాజకీయాల్లో సుమారు రెండు దశాబ్దాల పాటు కేసీఆర్‌తో ప్రయాణం సాగించిన మాజీమంత్రి ఈటల రాజేందర్ సైతం సీఎం కేసీఆర్ ఊహించని విధమైన రాజకీయ ఎత్తు వేయబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్‌ రాజీనామాకు సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన ఈటల బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. 

Etela Rajendar Resignation

కమలం తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ నెల 4న అంటే రేపే ఈటల రాజేందర్‌ టిఆర్‌ఎస్‌కు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అయితే ఇంకో మంచిరోజు చూసుకుని ఢిల్లీకి వచ్చి బిజెపిలో చేరతానని ఈటల రాజేందర్‌ సన్నిహితుల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఈటలతో సహా మొత్తం అయిదుగురు నేతలు బిజెపి జెండా కప్పుకోనున్నారు. సోమవారం జెపి నడ్డాను, మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ని, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని ఈటల రాజేందర్‌ కలిశారు.

ఏనుగు రవీందర్‌ రెడ్డిలు ఛుగ్‌, మాజీ ఎంపి జి.వివేక్‌తో కలిసి ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌తో సాయంత్రం ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశంలోనే ఈటల రాజేందర్‌ తాను బిజెపిలో చేరతానని వెల్లడించారు.

Read Also: AP News | TG News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleవంటలక్క షాకింగ్ కామెంట్స్..తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ?
Next articleఈ టెస్ట్‌తో గుండెనొప్పి గురించి ముందే తెలుసుకోవచ్చు..ఆ టెస్ట్ ఏంటంటే