Home ఆరోగ్యం మీకు గొంతునొప్పా? మీ సమస్యలకు అద్భుతమైన దివ్యౌషధం ఇదే

మీకు గొంతునొప్పా? మీ సమస్యలకు అద్భుతమైన దివ్యౌషధం ఇదే

251
0
Eat These Fruits When Sore Throat Deseases Quickly
Eat These Fruits When Sore Throat Deseases Quickly

చాలా మంది గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. వారు ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా ఉంటుంది. ప్రస్తుత కరోనా సమయంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యలు అధికంగా వేధిస్తుంటాయి. ఈ సమస్యలున్న ఎవరినైనా వారికి కరోనా ఉందేమోనని భయపడిపోతుంటారు. చలికాలం వస్తే చాలు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి వీటిని తగ్గించుకోవడానికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల పండ్లను తింటే అనేక ఫలితాలు అనేవి ఉంటాయి. మరి ఆ పండ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

పైనాపిల్ తినడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు సమస్యలకు ఈ పండు చాలా ఉపశమనం కలిగిస్తుంది.

మల్బరీ యాంటీపైరెటిక్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు వీటిని ఎక్కువ సేపు నమిలితే ప్రయోజనం కలుగుతుంది.

పాలకూర ఆకులను ఉడకబెట్టి, నీటిని వడపోయండి. ఈ నీటిలో కొద్దిగా అల్లం రసం కలిపి గార్గిల్ చేస్తే గొంతు నొప్పి పూర్తిగా మాయమవుతుంది.

గొంతు నొప్పి నయం చేయడానికి వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

Eat These Fruits When Sore Throat Deseases Quickly
Eat These Fruits When Sore Throat Deseases Quickly

ఒక గ్లాసు నీటిని తీసుకొని దానిలో 4 నుంచి 5 అంజీరలను వేసి వడపోసి వేడి చేయండి. దీనిని ఉదయం, సాయంత్రం తాగితే మీ గొంతు నొప్పి పోతుంది.

తొమ్మిది-పది మిరియాలు తీసుకొని గ్రైండ్ చేసి తరువాత నెయ్యి లేదా చక్కెర సిరప్ తో చప్పరించండి. ఇలా చేస్తే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

మన వంటింట్లో అల్లం, బెల్లం, మాసాలా దినుసులను కలిసి కషాయంగా చేసుకొని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. 

లవంగాలు, నల్ల మిరియాలు, యాలకులు, అల్లం, బెల్లం వేసి కాసేపు వేడి చేసి తీసుకోవడం వలన గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గుతాయి. 

దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, టూస్పూన్ అల్లం, నల్ల ఉప్పు, పసుపు, నల్ల మిరియాలు, 5-6 తులసి ఆకులను వేసి కషాయంగా చేసుకోవాలి. 

దీనిని తాగడం వలన చాతి నొప్పి, జలుబు సమస్యలను నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. 

మరెందుకు ఆలస్యం మీరుకూడా మీ ఇంట్లోనే ఈ చిట్కాలను పాటిస్తూ గొంతునొప్పి, జలుబు, దగ్గు రాకుండా చేసుకోండి.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణీ
Next articleనేడు ‘జాతినుద్దేశించి’ మోడీ ప్రసంగం