Home ఆరోగ్యం టీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?

టీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?

167
6
Don't Have These Foods With Tea
Don't Have These Foods With Tea

చాయ్.. చూస్తే చాలు అలసిన ప్రాణానికి ఊరట కలుగుతుంది. కాలంతో సంబంధం లేదు.. ఒక్క సారి అలవాటైనా చాలు. సెగలు కక్కే టీ అంటే ఎవరైనా ఇష్టపడాల్సిందే. గ్రీన్ టీ, బ్లాక్ టీ, జింజర్ టీ, మసాలా టీ, లెమన్ టీ.. ఇలా ఎన్నో రకాల టీలను పలువురు సేవిస్తూ ఉంటారు. మరి అటువంటి టీతో కలిపి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి నష్టం చేకూరుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

టీ లో ఉండే టానిన్లు, యాక్సిలెట్లు శరీరానికి ఐరన్ తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితం గా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, గింజలను టీ తో కలిపి తీసుకుంటే శరీరానికి చేటు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Dont Have These Foods With Tea

ఇక లెమన్ టీ అంటే చాలా మందికి ఇష్టం. ఉదయం లేచిన వెంటనే లెమన్ టీ తాగితే చాలా నష్టమని అధ్యయనాల్లో తేలింది. నిమ్మ రసం ఆమ్లం అని తెలిసిందే. దీనిని ఖాళీ కడుపున టీ తో కలిపి తీసుకుంటే అందులో ఉండే ఆక్సిడెంట్లతో గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండెలో మంట వంటివి ఏర్పడుతాయి. ఇక పకోడీలతో కలిపి టీ తీసుకున్నా ఇబ్బందులుంటాయి. శనగ పిండితో చేసిన పదార్థాలు త్వరగా అరగవు కనుక పోషకాలను గ్రహించే సామర్థ్యం శరీరానికి తగ్గుతుంది.

టీ పసుపు తో కూడిన మిశ్రమ పదార్ధాలను తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యకు దారితీస్తుంది. టీ తో పాటు చల్లని పదార్ధాలను తీసుకుంటే శరీరానికి వికారం కలిగినట్లు ఉంటుంది. టీ తీసుకున్న కొంత సేపటి వరకు, చల్లటి నీరు, ఐస్ క్రీమ్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19  

Previous articleజనంతో కిక్కిరిసిపోయిన రామ్ నగర్ ఫిష్ మార్కెట్
Next articleస్టార్ సింగర్ ఘంటసాల ఇంట్లో తీవ్ర విషాదం శోక సంద్రం లో సినీ పరిశ్రమ

6 COMMENTS

Comments are closed.