Home ఆరోగ్యం పెరుగు తినేవారికి అలర్ట్..వీటితో కలిపి తింటే ఆ ప్రమాదం

పెరుగు తినేవారికి అలర్ట్..వీటితో కలిపి తింటే ఆ ప్రమాదం

219
0
Don't Eat These Food Items With Curd
Don't Eat These Food Items With Curd

పెరుగు..పోషకాలు అందించే ముఖ్య పదార్థం. ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగును తినాలని చాలా మంది సూచిస్తుంటారు. పెరుగు తినడం వల్ల చర్మ సమస్యలు ఉండవు. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 వంటి అనేక పోషక పదార్థాలు ఉంటాయి. అటువంటి పెరుగును తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా పెరుగు చూస్తుంది. అయితే కొన్నింటిలో పెరుగును కలిపి తీసుకుంటే అనేక నష్టాలు వాటిల్లే ప్రమాదముంది. మరి ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు చల్లగా ఉంటుంది. ఉల్లిపాయ వేడి చేస్తుంది. ఇవి రెండూ కలిపి తినడం వల్ల అలెర్జీలు, గ్యాస్, ఆమ్లత్వం, వాంతులు వస్తాయి.

Dont Eat Onions With Curd

పెరుగు, చేపలను కలిసి తినకూడదు. ఈ రెండు కలిపి తినడం హానికరం. ఇది వాంతులు, అజీర్ణానికి దారితీస్తుంది.

Dont Eat Sea Food With CUrd

పాలు తాగితే పెరుగు తినకండి. ఈ రెండు కలిపి తీసుకోకూడదు. అలా రెండూ కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, డయేరియా, ఆమ్లత్వ సమస్యలను కలిగిస్తుంది.

మినపప్పు పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. ఈ రెండు కలిపి తినడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

పెరుగుతో పాటు మీరు ఆయిల్ ఫుడ్స్‌ను కూడా తింటే అది మీ జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రోజంతా మీరు బద్దకంగా గడుపుతారు. 

మామిడి, పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. అది మన శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుంది. 

Dont Eat Mangos With CUrd

కాబట్టి ఈ ఆహార పదార్థాలతో పెరుగును కలిపి తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleబిగ్ బాస్ సీజన్ 5లో ఉండేది వీరే..త్వరలో ప్రారంభంకానున్న షో
Next articleఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణీ