Home Covid 19 సిఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు ఎప్పటివరకంటే?

సిఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు ఎప్పటివరకంటే?

169
0
AP Covid Curfew Extended
AP Covid Curfew Extended

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  సడలింపు సమయం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గత నెల 5 న రాష్ట్ర ప్రభుత్వం పగటి  కర్ఫ్యూని అమలు చేసింది.

అయినప్పటికి కేసులు తగ్గకపోవడంతో తొలుత మే నెలాఖరుకు, అనంతరం ఈ నెల పదో తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగించారు. ఆ గడువు కూడా దగ్గర పడడంతో వివిధ శాఖల అధికారులు, మంత్రులుతో సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులతో సమీక్షించి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleతెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత? సిఎం సంచలన నిర్ణయ
Next articleక్రికెట్ చరిత్రలోనే ఇదొక చెత్త రికార్డ్..20 ఓవర్లలో ఒకే ఫోర్