Home జాతీయ వార్తలు ఇక చిన్నారులకు కూడా వ్యాక్సిన్..కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభం

ఇక చిన్నారులకు కూడా వ్యాక్సిన్..కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభం

141
0
Covid Vaccine Trails On Childrens
Covid Vaccine Trails On Childrens

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా  తొలిదశలో చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే రెండోదశలో మాత్రం ముప్పు కొద్దిగా కనిపించింది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. చాలా రోజులుగా పెద్ద వయసు వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తూ వస్తున్నారు. అయితే ఇకపై పిల్లలకు కూడా వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రానుంది. 2-18 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ అందించనున్నారు. పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత్‌ బయోటెక్‌ సన్నద్దమవుతోంది. 

టీకా ట్రయల్‌ ప్రధాన పర్యవేక్షకుడిగా ఉన్న డాక్టర్ సీఎం సింగ్‌ గురువారం పిల్లలపై వ్యాక్సిన్ వేసే విషయంపై వివరాలను తెలిపారు. పట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో 525 మంది పిల్లలకు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటన చేశారు. టీకా వేసే ముందు వారికి యాంటీజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు. ఆ తర్వాత రోజూ ఆ పిల్లల ఆరోగ్య స్థితులను నమోదు చేసుకుంటారు. చిన్నారులపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌కు మే నెల 11న డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చిందని నీతి ఆయోగ్‌ మెంబర్ వీకే పాల్‌ వెల్లడి చేశారు. 

భారత్‌లో ఇప్పుడు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి టీకాలు వేస్తున్నారు. అందులో కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ తయారు చేసింది. కొవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్నవారిపై ఈ టీకా 78 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఇకపోతే ప్రపంచంలోని చాలా దేశాలు ఫైజర్ టీకాను 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఏళ్ల పిల్లలకు వేసేందుకు అనుమతులిచ్చాయి. అయితే భారత్‌లో చిన్నపిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్‌ చేస్తుండటం ఇదే మొదటిసారి.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleటీఆర్ఎస్ లో హరీష్‌రావుకూ అవమానాలెక్కువే..షాకింగ్ కామెంట్స్ చేసిన ఈటల
Next articleకోవిడ్ పై పోరులో స్వదేశీ టీకా..భారత శాస్త్రవేత్తలను ప్రశంసించిన మోదీ