Home అంతర్జాతీయ వార్తలు వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాక్..జీతాలు కట్ చేస్తూ సీఎం సంచలన ఆదేశాలు

వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాక్..జీతాలు కట్ చేస్తూ సీఎం సంచలన ఆదేశాలు

186
0
CM Reaction On Govt Employees Who Refuse Covid Vaccine
CM Reaction On Govt Employees Who Refuse Covid Vaccine

ప్రపంచవ్యాప్తంగా కరోనా అలజడి రేపుతోంది. ఈ మహమ్మారికి చాలా మంది బలైపోయారు. అందుకే ఆయా దేశాలు వ్యాక్సినేషన్ ద్వారా కరోనాను అంతం  చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు, ఆంక్షలతో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ అందరినీ సురక్షితంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా కొంత మంది వ్యాక్సిన్ వేసుకోవడానికే భయపడుతున్నారు.

వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొంత మంది అనారోగ్యపాలై ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి కొందరు భయపడుతున్నారు. లేనిపోని కారణాలు చెప్పి వ్యాక్సిన్ వేసుకోవడాన్ని వాయిదా వేస్తూ పరార్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పలు కఠిన చర్యలు తీసుకుంటూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. 

CM Reaction On Govt Employees Who Refuse Corona Vaccine

తాజాగా పాకిస్థాన్ సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్అలీ షా ఉద్యోగుల పట్ల కఠిన చర్యలు తీసుకున్నారు. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నారో, వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల జీతాలను ఇవ్వకూడదని నిర్ణయించారు. దీంతో టీకా వేసుకోకుండా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు జులై నెల నుంచి జీతాలు రావు. కొవిడ్ టీకాలు వేయించుకోని వారికి వచ్చే నెల నుంచి జీతాలు చెల్లించరాదని పాక్ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. 

సింధ్ ప్రావిన్సుల కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనే సీఎం ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రధాన కార్యదర్శి, వైద్య నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్ కోసం జూన్ నెల సమయం ఇవ్వాలని సీఎస్‌కు మురాద్‌అలీ షా సూచించారు. సింధ్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,550,553 మందికి టీకా వేయగా 4,29,000 మంది రెండు డోసుల వేయించుకున్నారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడానికి అదనంగా 300 టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రోజుకు 30,000 మందికి వ్యాక్సిన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 9,26,695 మందికి కరోనా సోకగా, 21,022 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleవాహనదారులకు షాక్..మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర
Next articleగానగంధర్వుడికి గాయకుల ఘన నివాళి