Home తెలంగాణ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం

90
0
CM KCR Take Another Key Decision
CM KCR Take Another Key Decision

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. మరో రెండు రోజుల్లో తెలంగాణలోనొ పంతొమ్మిది జిల్లాల కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్య అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రజలకు సరైన వైద్యం కొరవడుతోందన్నారు. వైద్యం అనేది ఖరీదుగా మారిపోయిందన్నారు. పేదలు ఆస్తులు అమ్ముకుని మెడికల్ బిల్లులు కట్టే పరిస్థితి దాపురించిందన్నారు. అందుకే ప్రభుత్వ ఆధీనంలో నడిచే డయాగ్నోస్టిక్ కేంద్రాలను మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సర్కారు డయాగ్నోస్టిక్‌ కేంద్రాలలో 57 వైద్య పరీక్షలను ఉచితంగానే చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ప్రజలు సరైన వైద్యం పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెస్తోందన్నారు. ఉచిత పథకాలు ఇస్తూ ప్రజలకు సేవ చేయడమే కర్తవ్యమన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా అయిన డయాగ్నోస్టిక్‌ సెంటర్లను తెలంగాణలో ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleదేశంలోని ఆ రాష్ట్రాల్లో అన్ లాక్..భారీ సడలింపులు
Next articleఈటలపై హరీశ్ రావు ఫైర్..తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి