Home జాతీయ వార్తలు పెన్షన్ ల విషయం లో మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

పెన్షన్ ల విషయం లో మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

67
0
Central Govt Another Sensational Decision On Pensions
Central Govt Another Sensational Decision On Pensions

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చల్లని వార్త చెప్పింది. మృతిచెందిన గవర్నమెంటు ఉద్యోగుల కుటుంబీకులకు మేలు చేసే ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కన్నుమూస్తే కుటుంబీకుల నుంచి క్లెయిమ్ వచ్చిన వెంటనే 30 దినాలలో ఆ కుటుంబీకులకు పింఛన్ ఇవ్వాలని అన్నీ ప్రభుత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలచ్చింది.  పాత పెన్షన్‌ పథకం, జాతీయ పెన్షన్‌ కింద ఉన్న వ్యక్తి చనిపోయినట్లు అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వాల్సిన నగదు మొత్తాన్ని ఆ కుటుంబీకులు ఇవ్వనున్నట్లు తెలియజేసింది. 

ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని, ఎన్‌పీఎస్‌ పెన్షన్‌ కార్పస్ ను కుటుంబీకులకు తొందరగా చెల్లించేందుకు ఆదేశాలను ఇచ్చింది. అంతేకాకుండా కుటుంబ పింఛన్ ను మొదలుపెట్టే టైంలోనే ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ అకౌంట్ నంబర్ ను తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. పింఛన్ క్లెయిమ్ చేయగానే దానికి చెందిన ఉన్నత ఉద్యోగి ప్రొవిజనల్ పింఛన్ ను అర్హులైన కుటుంబీకులకు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జనవరి 1వ తేది నుంచి కన్నుమూసిన సర్కార్ ఎంప్లాయిస్ వివరాలు, వారి కుటుంబీకుల పింఛన్ జారీ, ఇతర చెల్లింపుల సమాచారాలను నెలవారీగా పంపించాలని అన్ని శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఅలజడి రేపుతోన్న ట్విట్టర్..ఉపరాష్ట్రపతి, ఆర్ఎస్ఎస్ నాయకుల ఖాతాలో బ్యాడ్జీలు తొలగింపు
Next articleఆ అధికారికి షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ కృష్ణరాజు..కేసులో మరో ట్విస్ట్