Home ఆరోగ్యం చికెన్​ వల్ల బ్లాక్​ ఫంగస్..​వైరల్ అవుతోన్న ఫేక్ న్యూస్..నిజమెంత ?

చికెన్​ వల్ల బ్లాక్​ ఫంగస్..​వైరల్ అవుతోన్న ఫేక్ న్యూస్..నిజమెంత ?

239
1
Can Block Fungus Spread Through Farm Chicken?
Can Block Fungus Spread Through Farm Chicken?

దేశంలో కరోనా తీవ్రత తగ్గడం సంతోషకరమైన విషయం. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. బ్లాక్​ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోవడం వల్ల అందరిలో భయాందోళన ఎక్కువవుతోంది.​కరోనా నుంచి కోలుకున్న రోగులు బ్లాక్​ ఫంగస్​ బారిన పడి మరణిస్తున్న సంఘటలు చోటుచేసుకోవడం అందర్నీ కలచివేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఫంగస్​ పట్టిన ఉల్లిపాయతో బ్లాక్​ ఫంగస్​ వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది.

ఆ తర్వాత తాజాగా ఇప్పుడు చికెన్​ తింటే బ్లాక్​ ఫంగస్​ వస్తుందని నెట్టింట వైరల్ అవుతోంది. బ్లాక్​ ఫంగస్​ విషయంలోనూ ఫేక్​ న్యూస్​ వైరల్ అవుతోంది. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఫాక్ట్​ చెక్ స్పష్టతనిచ్చింది. “చికెన్​ తింటే బ్లాక్​ ఫంగస్​ వస్తుందన్న వార్తల్లో నిజం లేదు. ఈ ఇన్ఫెక్షన్ కోళ్ల నుంచి మానవులకు వ్యాపిస్తుందన్న దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల నిస్సందేహంగా చికెన్​ తినవచ్చు” అని ట్వీట్ చేసింది.

తాజాగా ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) సీనియర్​ సైంటిస్ట్​ డాక్టర్​ అపర్ణ ముఖర్జీ కూడా దీనిపై స్పందించారు. వాతావరణంలో ఉండే బ్లాక్​ ఫంగస్​ కోళ్లకి వస్తుందని, ఆ కోళ్ల ద్వారా మనుషులకు సోకుతుందన్న వాదనలో అర్థం లేదని చెప్పారు. బ్లాక్​ ఫంగస్​ అంటువ్యాధి కాదు, అలాంటప్పుడు జంతువుల నుంచి కోళ్లకు ఎలా సోకుతుందని ఆమె వివరించారు. కాబట్టి చికెన్​ తినేందుకు భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

Read Also: ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ తెలంగాణా న్యూస్ అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు కోవిడ్ 19 న్యూస్

Previous articleచెరుకు పిప్పితో కోట్లల్లో లాభం..ఈ మహిళ చేస్తున్న పనికి హ్యాట్సాఫ్
Next articleవంటలక్క షాకింగ్ కామెంట్స్..తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ?