Home ఆంధ్ర ప్రదేశ్ దంతాల సమస్యా?..ఫంగస్ ఉందో లేదో టెస్ట్ చేసుకోండి

దంతాల సమస్యా?..ఫంగస్ ఉందో లేదో టెస్ట్ చేసుకోండి

81
0
Black Fungus Symptoms
Black Fungus Symptoms

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. థర్డ్ వేవ్ కూడా రానుందని, అది పిల్లలపై, గర్భిణులపై తన ప్రభావాన్ని చూపుతుందని వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు. అయితే ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరో వైపు ఫంగస్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కరోనాను అంతం చేసే క్రమంలో చాలా మంది స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్‌ వినియోగిస్తున్నారు. వాటి వల్ల కరోనా తగ్గినా ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ సమస్య తలెత్తుతోంది. తాజాగా ఓ మహిళ తనకు పంటి నొప్పి ఉందని ఆస్పత్రికి వెళితే బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు బయటపడింది. కరోనా సోకిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఎవరికైనా దంతాల సమస్య అనేది తలెత్తితే పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ బ్లాక్ ఫంగస్ అనేది ముక్కుకు నోటికి మధ్యలో ఉన్న ‘మాక్సిల్లా’ ఎముకపై ముందుగా ప్రభావం చూపుతుంది. దీని వెనుకవైపు చెవి, ముక్కు, గొంతు ఉంటాయి. కిందివైపు దంత సంబంధిత వ్యవస్థలు ఉంటాయి. ఫంగస్‌ చాలా వరకు ముక్కు నుంచే ప్రవేశిస్తుంది. కరోనా ఇన్ఫెక్ట్‌ అయ్యే ప్రాంతం కూడా అక్కడే ఉండడంతో సమస్య తీవ్రత పెరుగుతుంది. సైనస్‌ సంబంధిత సమస్యలు, నొప్పి అధికంగా ఉండడం వల్ల ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అదే నోటిలో దుర్వాసన, పళ్లు కదలడం, చిగుళ్ల వాపు, చీము రావడం వంటి సమస్యలు వస్తే వెంటనే డెంటిస్ట్‌లను సంప్రదించడం ఎంతో మంచిది. ఇలాంటి సమస్యలు లేదా లక్షణాలతో వచ్చిన పేషెంట్లను పరీక్షించినప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడుతున్నాయి. 

ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ, న్యూరాలజీ అంశాలకు సంబంధించిన సమస్య బ్లాక్‌ ఫంగస్‌. ఇది ముక్కులోంచి ప్రవేశించి పైదవడ, సైనస్, కళ్లు, మెదడుపై ప్రభావం చూపుతుంది. ఉన్నట్టుండి దంతాలు వదులుకావడం, అక్కడక్కడా తెల్లపొక్కులు ఏర్పడటం, చిగుళ్లకు రంధ్రాల మాదిరిగా ఏర్పడి చీము కారడం, అంగిటి నల్లబడటం, పన్ను తీసేసినప్పుడు గాయం ఆలస్యంగా మానడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి టెస్టులు చేయించుకోవాలి. ఎలాంటి లక్షణాలు లేకున్నా పైదవడ నొప్పి, వాపు వస్తే.. ఫంగస్‌ వ్యాపించిన మేర కణజాలాన్ని తొలగించాలి, యాంటీ ఫంగల్‌ డ్రగ్స్‌ ఇవ్వాలి.

ఒకవేళ పైదవడ పూర్తిగా తొలగించాల్సి వస్తే.. అప్చురేటర్‌ ద్వారా వివిధ స్థాయిల్లో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుగుడ్డు తొలగించాల్సి వస్తే ఆర్టిఫిషియల్‌ కన్నును డెంటిస్ట్‌లే అమర్చాల్సి ఉంటుంది. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడిన వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. 3, 4 రోజుల్లోనే ఈ ఫంగస్‌ మెదడుకు చేరుకుని, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు కోవిడ్‌ కారణంగా షుగర్‌ పేషెంట్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడినవారికి, కేన్సర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ పేషెంట్లకు బ్లాక్‌ ఫంగస్‌ ఎక్కువగా సోకుతోంది.

Previous articleజార్ఖండ్ లో వింత జీవి..ఏలియనే అంటున్న నెటిజన్స్
Next articleలాక్ డౌన్ రూల్స్ బ్రేక్..రూ.కోట్ల జ‌రిమానాలు ఎన్ని కోట్ల