Home ఆంధ్ర ప్రదేశ్ ఏడాదిన్నర బాలుడికి బ్లాక్‌ ఫంగస్‌..కాపాడిన డాక్టర్లు

ఏడాదిన్నర బాలుడికి బ్లాక్‌ ఫంగస్‌..కాపాడిన డాక్టర్లు

160
0
Black Fungus For One Year Old Boy In AP
Black Fungus For One Year Old Boy In AP

అసలే కరోనాతో దేశం విలవిల్లాడుతుంటే ఇప్పుడు ఈ ఫంగస్ కేసులు ఎక్కువైపోతున్నాయి. దేశంలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ రకరకాల ఫంగస్ లు పుట్టుకొస్తున్నాయి. వీటిబారిని పడి చాలా మంది తనువు చాలిస్తున్నారు. అయితే వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తూ కొందరిని ప్రాణాపాయం నుంచి బయటపడేస్తున్నారు. తాజాగా వైద్యులు ఏడాదిన్నర బాలుడిని ప్రాణాల నుంచి కాపాడారు. ఫంగస్ కేసులు పెద్దలకు రావడమే చూశాం. కానీ ఇప్పుడు పిల్లలకు రావడం మొదటిసారి. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన 18 నెలల చిన్నారికి మే 28న బ్లాక్‌ ఫంగస్ సోకింది. దీంతో ఆ బాలుడిని కాకినాడలోని జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్‌ కృష్ణకిషోర్‌ చిన్నారి ముక్కు, కన్ను, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ చేరినట్టు గుర్తించారు. 

10 మంది పీడియాట్రిక్‌ వైద్యుల బృందంతో కలిసి ఆ చిన్నారికి గురువారం అత్యాధునిక ఫంక్షనల్‌ ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ (ఎఫ్‌ఈఎ్‌సఎస్‌) చేశారు.  మూడు గంటల ముప్పై నిమిషాల పాటు బాబుకు ఆపరేషన్ చేశారు. చిన్నారి ఎడమ పక్క ఉన్న ముక్కు, ఎడమ కన్నులో నుంచి ఊపిరితిత్తుల వరకు వ్యాపించిన ఫంగస్ ను తీసివేశారు. డాక్టర్‌ కృష్ణకిషోర్‌ ఆధ్వర్యంలో ఏడాదిన్నర బాబుకు చేసిన ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావుల మహాలక్ష్మి వైద్య సిబ్బందిని అభినందించారు. త్వరలో ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌ రిపోర్టు వచ్చిన తర్వాత ఈ ఫంగస్ కు గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleRBI కీలక ప్రకటన..ఆ వడ్డీ రేట్లలో మార్పు లేదు
Next articleసీఎం కేసీఆర్ పై ఈట‌ల ఫైర్..కౌంట‌ర్ ఇచ్చిన పల్లా