Home సినిమాలు బిగ్ బాస్ సీజన్ 5లో ఉండేది వీరే..త్వరలో ప్రారంభంకానున్న షో

బిగ్ బాస్ సీజన్ 5లో ఉండేది వీరే..త్వరలో ప్రారంభంకానున్న షో

308
0
Bigg Boss Season Start Date And Contestants List
Bigg Boss Season Start Date And Contestants List

తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో అని టక్కున చెబుతారు. అన్ని ఇండస్ట్రీలలో బిగ్ బాస్ షో అనేది విజయవంతంగా కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిగ్ బాస్ ఒక హాట్ స్టేజ్ షోగా విరాజిల్లుతోంది. ఇందులోకి వచ్చిన కంటెస్టెంట్స్ పాపులారిటీని బాగా సంపాదించుకుంటారు. తెలుగులో ఫస్ట్ సీజన్ నుంచి ఈ షో బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ నాలుగు సీజన్లను ఇది పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదవ సీజన్ కోసం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వేసవిలో ఐదవ సీజన్ ప్రారంభించాలి. అయితే కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు కేసులు తగ్గుతుండటం వల్ల మళ్లీ బిగ్ బాస్ సీజన్ 5ను ప్రారంభించాలనుకుంటున్నారు. 

Bigg Boss Season 5

ప్రస్తుతం ఐదవ సీజన్ బిగ్ బాస్ గురించి కంటెస్టెంట్స్  వెతుకులాటలో పడ్డారు. ఇంకో వారం లేదా 10 రోజుల్లో కంటెస్టెంట్ల పేర్లను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన తర్వాత వారిని క్వారంటైన్‌లో ఉంచి ఆ తర్వాత సీజన్ స్టార్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. జూలై 2వ వారంలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో ఉండనున్న కంటెస్టెంట్స్ పేర్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష ఆ లిస్టులో ఉన్నట్లు కొన్ని వార్తలు సందడి చేస్తున్నాయి. మరి అసలు నిజం తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఫేక్ న్యూస్ పని ఖతం..‘బర్డ్ వాచ్’ పేరుతో ట్విట్ట‌ర్‌ కొత్త టూల్‌
Next articleపెరుగు తినేవారికి అలర్ట్..వీటితో కలిపి తింటే ఆ ప్రమాదం