Home Covid 19 కంట్లోనే ఆనందయ్య మందు ఎందుకు? నిపుణులు చెప్పిన సీక్రెట్స్ ఇదే

కంట్లోనే ఆనందయ్య మందు ఎందుకు? నిపుణులు చెప్పిన సీక్రెట్స్ ఇదే

328
1
Ayush CEO Revel Secrets About Anandayyas Herbal Medicine
Ayush CEO Revel Secrets About Anandayyas Herbal Medicine

కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించి తెలుసుకుని ఆయుష్ విభాగం, ఆయుర్వేద నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్ధరించారు. దీంతో ఆనందయ్య మందుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మందును వీలైనంత త్వరగా అందరికీ చేరేలా చూసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ కంటిలో వేసే మందు తప్ప మిగతావన్నీ రోగులకు అందివచ్చని సర్కార్ కండీషన్ పెట్టింది. కంట్లో వేసే మందుపై ఇంకా రిపోర్టులు రాలేదు.

అందుకే అనుమతులు ఇవ్వలేదు. కదల్లేని స్థితుల్లో ఉన్న కరోనా బాధితులు ఆనందయ్య మందును కంట్లో వేయగానే లేచి ఎలా కూర్చుంటున్నారు. ఆక్సిజన్ స్థాయిలు అమాంతంగా ఎలా పెరుగుతున్నాయన్న దానిపై ఢిల్లీ ఎంసీడీ ఆయుష్ విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కామేశ్వరరావు కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిపారు. 

కంటిలో మందు వేయడమనేది కొత్త విషయం కాదు. కానీ, కరోనా వల్ల ఆక్సిజన్ కోల్పోతున్న వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు ఆనందయ్యకు ఈ ఆలోచన రావడం నిజంగా అద్బుతమనే చెప్పాలి. పాము కాటు వల్ల మెదడుకు ఆక్సిజన్ అందక చనిపోతారు. కాబట్టి ఆయనకు ఆ ఆలోచన వచ్చి ఉండవచ్చు. పైగా ఆయన కంట్లో వేసేందుకు ఉపయోగిస్తున్న పదార్థాలు, మూలికలు సురక్షితమైనవి. వాటిలో ఏవీ హానికరమైనవి కావని ఆయుష్, ఆయుర్వేద నిపుణులు తెలిపారు.

శరీరంలో ఫాస్టెస్ అబ్జర్వేటివ్ రూట్ కంజుంక్టివా అంటే కంటి పొర అని ఒక్కటే మార్గం. అక్కడ డ్రాప్స్ వేస్తే వెంటనే మెదడులోకి వెళ్లిపోతుంది. పాత కాలంలో మందులు లేనప్పుడు పసర్లు పోసేవారు. పాము కాటు తర్వాత మెదడుకు ఆక్సిజన్ అందకపోతే చనిపోతారు కాబట్టి చివరి ప్రయత్నంగా పసర్లు పోసి ప్రాణం నిలబెట్టేవారు. ఈ విషయంలో ఆనందయ్య ఐడియాలజీ చాలా బాగుందని అయితే, ఆయుర్వేదంలోని కొందరు వ్యక్తులు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయుష్, ఆయుర్వేద నిపుణులు తెలిపారు. 

Read Also: ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ తెలంగాణా న్యూస్ అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు కోవిడ్ 19 న్యూస్

Previous articleహైదరాబాద్ లో వింత.. ఆకాశంలో సూర్యని చుట్టూ అద్బుతం
Next articleకరోనా వ్యాక్సిన్ మనిషిని ఎంతకాలం కాపాడగలుగుతుంది? సంచలన విషయాలివే

1 COMMENT

  1. […] Ayush CEO Revel Secrets About Anandayyas Herbal Medicine: కంట్లోనే ఆనందయ్య మందు ఎందుకు? నిపుణులు చెప్పిన సీక్రెట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం  […]

Comments are closed.