Home ఆంధ్ర ప్రదేశ్ ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ

ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ

111
0
AP CM Jagan Wrote A Letter To PM Modi
AP CM Jagan Wrote A Letter To PM Modi

ఏపీలో అందరికీ ఇళ్లు కార్యక్రమానికి తగిన సహకారం అందించాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం పేదలందరికీ ఇళ్లు – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంపై ఆయన ప్రధానికి లేఖ రాశారు. 2022 కల్లా పేదలందరికీ పక్కా ఇళ్లను కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయం చాలా గొప్పదని ఆయన కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే రాష్ట్రంలో 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో 30.76  లక్షల మందికి 68,381 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో 28.35 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు చేపట్టినట్లు వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.23,535 కోట్లు వెచ్చించిందని, మరో రూ.34,104 కోట్లు నిధులు అవసరం ఉందని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, పేద ప్రజలకు నిర్మించే పక్కా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద అవసరమైన నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleమహాత్మాగాంధీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష… కారణం ఇదే..
Next articleబాలీవుడ్ వైపు పూరి చూపు