Home ఆంధ్ర ప్రదేశ్ ఇంటి వద్దకే ఆనందయ్య మందు..ఆన్ లైన్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు

ఇంటి వద్దకే ఆనందయ్య మందు..ఆన్ లైన్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు

238
0
anandayya Medicine Distribution
anandayya Medicine Distribution

కరోనాతోొ అల్లాడుతున్న దేశానికి ఆనందయ్య మందు సంజీవనిలా పనిచేసింది. అందరూ సంతోషాల మధ్య పండగ చేసుకున్నారు. ఆనందయ్య మందు వచ్చేసిందిలే అనుకుని సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ లోపే హైకోర్టు, ప్రభుత్వాలు కల్పించుకుని మందు పంపిణీని అపించేశాయి. ఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. కంటిలో చుక్కల మందుకు మినహా ఇతర మందులకు హైకోర్టు కూడా అనుమతివ్వడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మందుకు కావాల్సిన వనమూలికలను ఆయన శిశ్యులు సిద్ధం చేస్తున్నారు. 

మరో ఐదారు రోజుల్లోగా మందు పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. ఔషధం తయారీకి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించడంతో మందు పంపిణీపై ప్రకటన చేసే వరకు ఎవరూ కృష్ణపట్నం గ్రామానికి రావొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్ ఉన్నవారు మాత్రం ఎవరూ కూడా తన మందు కోసం రావద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తానని తెలిపారు. దేశం మొత్తం మందు పంపిణీ చేస్తానని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు మందు పంపిణీకి సంబంధించి సమావేశం నిర్వహించారు. త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వనమూలికలు సమీకరించి, నాలుగైదు రోజుల్లో పంపిణీ ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. అవసరమైన ప్రాంతాలకు తామే మందు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Previous articleమరో డేంజర్..ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి బర్డ్ ఫ్లూ
Next articleస్కిన్ బ్లాక్ ఫంగస్ కలకలం..దేశంలో తొలి కేసు నమోదు