Home సినిమాలు నటి జుహీ చావ్లాపై హైకోర్టు ఫైర్..రూ.20 లక్షల జరిమానా

నటి జుహీ చావ్లాపై హైకోర్టు ఫైర్..రూ.20 లక్షల జరిమానా

211
0
Latest News About Actress Juhi Chawla
Latest News About Actress Juhi Chawla

మనుషులపైనా, పర్యావరణం మీద 5జీ టెక్నాలజీ అనేది కీడు చేసేదిగా ఉందని బాలీవుడ్ నటి జుహీ చావ్లా ఆరోపణలు చేసింది. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టుకు పిటీషన్ ను పెట్టుకుంది. అయితే ఆమె వేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు ఆమోదించలేదు. ఆ నటి తన బ్లిసిటీ కోసమే పిటిషన్‌ను వేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి జుహీతో పాటు ఈ పిటిషన్‌ దాఖలు చేసిన వారందరూ కలిసి కోర్టు ఫీజు కింద రూ.20 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

జుహీ చావ్లా ఇచ్చిన లింక్‌ ద్వారా ఆమె పిలుపు మేరకు కొంత మంది కోర్టు వర్చువల్‌ విచారణలో పాల్గొని రాద్ధాంతం చేశారు. ఆమె నటించిన చిత్రాల్లోని పాటలు పాడుతూ విచారణకు అడ్డు తగిలారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని కోర్టు ఆదేశించింది. కేవలం పబ్లిసిటీ కోసమే జుహీ చావ్లా ఇలా చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Actress Juhi Chawla News

జుహీ చావ్లా, సామాజిక కార్యకర్తలు వీరేశ్ మాలిక్, టీనా వచని సోమవారం హైకోర్టులో ఈ పిటిషన్‌ను అందజేశారు. 5జీ టెక్నాలజీ వల్ల మనుషులపై అధికంగా రేడియేషన్ పడుతుందని ఆమె ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్‌ గురించి తెలియకపోవడంతో హైకోర్టు జడ్జి ఆశ్చర్యపడ్డారు. విచారణ సమయంలో కొంత మంది కోర్టులో వివాదాస్పదంగా ప్రవర్తించారు. అందులో కోర్టుకు తీవ్ర అంతరాయం కలగజేసిన ఓ వ్యక్తిపై కోర్టు ధిక్కార నోటీసు అందజేసింది. జుహీ చావ్లా నటించిన చిత్రాల్లోని పాటలు పాడుతూ ఆ వ్యక్తి అంతరాయం కలగజేశాడు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఆ అధికారికి షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ కృష్ణరాజు..కేసులో మరో ట్విస్ట్
Next articleదేశంలోని ఆ రాష్ట్రాల్లో అన్ లాక్..భారీ సడలింపులు