Home సినిమాలు ఐదేళ్లు సహజీవనం.. గర్బవతిని చేసి ముఖం చాటేశాడు.. మాజీ మంత్రిపై హీరోయిన్ చాందిని సంచలన ఆరోపణలు

ఐదేళ్లు సహజీవనం.. గర్బవతిని చేసి ముఖం చాటేశాడు.. మాజీ మంత్రిపై హీరోయిన్ చాందిని సంచలన ఆరోపణలు

372
0

రాజకీయ నేతలు సినీతారలను పెళ్లాడటం, సినీ యాక్టర్లు పొలిటిషన్స్ పెళ్లాడటం సాధారణంగా మారాయి. సినీ తారలకు, రాజకీయ నేతలకు సంబంధాలు ఉండటం అత్యంత సహజం. అయితే తాజాగా ఓ రాజకీయ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి తనను మోసగించారనే విషయాన్ని సినీ నటి చాందిని పోలీసులకు ఫిర్యాదు చేయడం దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. తమిళ సినీ రంగంలో యువ హీరోయిన్ చాందినీ వర్థమాన తారగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకొంటున్నారు. సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ యువ హీరోయిన్‌‌కు రాజకీయ నాయకుడితో పరిచయం ఏర్పడింది. ఏఐడీఎంకే ఎమ్మెల్యే, మంత్రి మణికందన్‌తో పరిచయం సహజీవనం వరకు వెళ్లింది.

ఐదేళ్లపాటు వారిద్దరూ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేశారు. మంత్రి మణికందన్‌తో సహజీవనం రంజుగా సాగింది. అయితే పెళ్లి వరకు రాగానే చాందినిని మంత్రి దూరంగా పెట్టడంతో వారి బంధం బాహ్య ప్రపంచానికి తెలిసింది. మంత్రి మణికందన్ తనను మోసగించాడంటూ ఆరోపణలు చేయడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.తనతో ఐదేళ్లు సహజీవనం చేసి నన్ను గర్బవతిని చేశారు. బలవంతంగా గర్బస్రావానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నా నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. కిరాయి గూండాలను నియమించి నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన జీవితాన్ని నాశనం చేసిన మంత్రి మణికందన్‌ బెదిరింపులకు బయపడేది లేదు అంటూ ఘాటుగా హీరోయిన్ చాందిని సమాధానం ఇచ్చింది. వారిద్దరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసింది. అంతేకాకుండా తనకు న్యాయం జరిగేంత వరకు మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేసింది.

మంత్రి మణికందన్‌పై పోలీసులకు హీరోయిన్ చాందిని ఫిర్యాదు చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉంది. తనకు న్యాయం చేయాలి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ సహజీవనానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు. తనను బెదిరించినట్టుగా కొన్ని సాక్షాలను పోలీసులకు అందించిందనే విషయం మీడియా కథనాల్లో స్పష్టమైంది. అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీటీవీ దినకరన్ గ్రూపులో చేరిన రెబెల్‌గా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యతిరేక కూటమిలో చేరడం వల్ల ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. చాందిని మలేషియాలో జన్మించారు. సినిమాలపై మోజుతో ఆమె చెన్నైలో అడుగుపెట్టారు. నాడోదిగల్ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ప్రస్తుతం పబ్జీ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా మంత్రిపై ఆరోపణలతో హీరోయిన్ చాందిని సెన్సేషనల్‌గా మారారు.

Also Read more articles : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సిద్దార్థ్ పితానిని అరెస్ట్
నిజంగానే షాక్ ఇచ్చాడు…వామ్మో, శవాలపై కళ్యాణ్ రామ్ భయంకరమైన లుక్

Previous articleబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సిద్దార్థ్ పితానిని అరెస్ట్
Next articleJathi Ratnalu:నక్కతోక తొక్కిన ‘జాతి రత్నాలు’ చిట్టి, భారీ చిత్రంలో ఛాన్స్