Home జాతీయ వార్తలు సెకండ్ వేవ్‌‌లో కరోనాతో ఎంతమంది డాక్టర్లు చనిపోయారంటే?

సెకండ్ వేవ్‌‌లో కరోనాతో ఎంతమంది డాక్టర్లు చనిపోయారంటే?

166
1
594 Doctors Passed Away Due To Covid 19 Second Wave
594 Doctors Passed Away Due To Covid 19 Second Wave

కరోనా దేశాన్ని పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సామాన్యులతో పాటు డాక్టర్ల ప్రాణాలు తీస్తోంది. కరోనా పేషంట్లను కాపాడేందుకు 24 గంటలు కృషి చేస్తున్న డాక్టర్లు ప్రాణాలను కరోనా పొట్టనబెట్టుకుంటోంది. డాక్టర్లపై కరోనా అటాక్ చేయడంతో పాలకులు, పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు.

కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో మొత్తం 594 మంది డాక్టర్లు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణించినవారి వివరాలను ఈ సంస్థ ఓ నివేదికలో ప్రచురించింది. ఢిల్లీలో అత్యధికంగా 108 మంది, బీహార్ లో 98 మంది, యూపీలో 67 మంది మరణించారని పేర్కొంది. ఆరు రాష్ట్రాల్లో 25 నుంచి 50 మంది ప్రాణాలు కోల్పోయారు. 

రాజస్థాన్ లో 43, ఝార్ఖండ్ లో 39, ఏపీ, తెలంగాణాలలో 32 మంచి చొప్పున మరణించగా తమిళనాడులో 21, మహారాష్ట్రలో 17, మధ్యప్రదేశ్ లో 16 మంది మృతి చెందారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇండియాలో తొలిదశలో డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ లో ప్రయారిటీ ఇచ్చారని ఇండియన్ మెడికల్ సంస్థ తెలిపింది. వైద్య సిబ్బందిపై దాడులు, హింస పెరగడం పట్ల ఈ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దీన్ని అరికట్టేందుకు గట్టి చట్టం తేవాలని ఇండియన్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. అనేక హింసాత్మక సంఘటనల మధ్య డాక్టర్లు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని రోగులకు సేవలు అందించాల్సి వస్తోందని, ఇప్పటికైనా వెంటనే ఈ దాడుల నివారణకు పటిష్టమైన చట్టాన్ని తేవాలని విజ్ఞప్తి చేసింది.

Read Also: ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ తెలంగాణా న్యూస్ అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు కోవిడ్ 19 న్యూస్

Previous articleట్యాబ్లెట్లను ఇలా వేసుకుంటే సేఫ్..జాగ్రత్తలివే
Next articleమోదీకి ఆరేళ్ల బాలిక కంప్లైంట్..పాప మాటలకు ఫిదా