Home Technology 300లకు పైగా ఖాతాలపై ఫేస్ బుక్ నిషేధం

300లకు పైగా ఖాతాలపై ఫేస్ బుక్ నిషేధం

274
0
Facebook bans over 300 accounts
Facebook bans over 300 accounts

300లకు పైగా ఖాతాలపై ఫేస్ బుక్ నిషేధం కోవిడ్ -19 టీకాలు మానవులను చింపాంజీలుగా మారుస్తాయని పేర్కొన్న 300కి పైగా ఖాతాలను ఫేస్‌బుక్ నిషేధించింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ రూపొందించిన కోవిడ్ -19 టీకాలు మానవులను చింపాంజీలుగా మారుస్తాయని కొన్ని ఫేస్ బుక్ ఖాతాల్లో తప్పుడు వార్తలు వచ్చాయి. ఈ ఖాతాలు రష్యన్ సమాచార నెట్‌వర్క్‌లకు లింక్ చేయబడ్డాయి. అంతే కాకుండా ప్రధానంగా భారతదేశం, లాటిన్ అమెరికా, యుఎస్‌లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి.

ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రజలను చింపాంజీలుగా మారుస్తుందని పేర్కొంటూ 2020 నవంబర్ లో మీమ్స్, పోస్టులు ఫేస్ బుక్ ద్వారా సర్క్యులేట్ అయ్యాయి. ఐదు నెలల విరామం తర్వాత 2021 మేలో అవి పునరావృత మయ్యాయి. లీక్ అయిన ఆస్ట్రాజెనెకా డాక్యుమెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా ఫైజర్ వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలు తలెత్తాయి.

తాము నిబంధనలు ఉల్లంఘించిన 65 ఫేస్బుక్ ఖాతాలను, 243 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిషేధించినట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. ఇది ఒక విదేశీ సంస్థపై తప్పుడు ప్రచారం చేసినట్లు తేలిందని ఫేస్ బుక్ తెలిపింది. డజనుకు పైగా ప్లాట్‌ఫారమ్‌లు, ఫోరమ్‌లలో ఆ తప్పుడు వార్తలు ప్రసారం అయ్యాయని పేర్కొంది. ఈ ప్రచారానికి సంబంధించిన లింక్‌లను కనుగొన్నట్లు వివరించింది. ఫాజ్ తమ ప్లాట్‌ఫారమ్ నుండి నిషేధించబడిందని చెప్పింది.

“అస్ట్రాజెనెకా చింపాంజీ జన్యువుల ఆధారంగా ఒక టీకాను సృష్టించింది. పరీక్షలు దుష్ప్రభావాలను చూపించినప్పుడు, ఈ టీకాను నిషేధించాలి. లేకుంటే మనమందరం చింపాంజీలు అవుతాము” అని బిజినెస్ ఇన్‌సైడర్ నెట్‌వర్క్ ఒక పోస్ట్‌ను ఉటంకించింది. దీంతో #AstraZenecakills, #AstraZenecalies, #stopAstraZeneca వంటి కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు సర్క్యులేట్ అయ్యాయి. దాదాపు 10,000 పోస్ట్‌లు తరచుగా వాటితో లింక్‌ చేయబడ్డాయని ఫేస్‌బుక్ తెలిపింది.

Reddit, Medium, Change.org, Medapply.co.uk వంటి బహుళ ఫోరమ్‌లలో ఈ ప్రచారం తప్పుదోవ పట్టించే కథనాలు, పిటిషన్‌లను సృష్టించిందని ఫేస్ బుక్ గుర్తించింది. తప్పుడు వార్తలను సృష్టించిన వారు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను ఉపయోగించినట్లు తేలింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మరియు టిక్‌టాక్‌లో ఇప్పటికే ఉన్న ప్రేక్షకులతో ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో సన్నిహితంగా ఉండడం, పోస్ట్‌ల మూలాన్ని బహిర్గతం చేయకుండా నిర్దిష్ట హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకుంది.

వీటిపై పరిశోధన చేసిన ఫేస్ బుక్.. ములాలను కనుక్కుంది. అనంతరం తప్పుడు వార్తలను ప్రసారం చేసిన ఖాతాలను గుర్తించి వాటిని నిషేధించింది.

Previous articleస్క్రాపేజ్ విధానంతో పాత వాహనాలు తుక్కుకే : మోడీ
Next articleబెంగళూరులో మరింత మంది చిన్నారులకు కరోనా