Home విద్య పది, ఇంటర్ చదివితే చాలు..ప్రభుత్వ ఉద్యోగాలివే

పది, ఇంటర్ చదివితే చాలు..ప్రభుత్వ ఉద్యోగాలివే

323
0
10th And Inter Based Govt Jobs
10th And Inter Based Govt Jobs

10th And Inter Based Govt Jobs:

చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఉంటుంది. అయితే వారు పెద్ద పెద్ద చదువులు చదివిన వారికే ఉద్యోగాలు వస్తాయనే భ్రమలో తమ ఆశను చంపుకుంటూ ఉంటారు. ఇలా ఉన్నత విద్యను చదివే వారికే గవర్నమెంటు ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ఉంది. నిజానికి 10వ తరగతి, ఇంటర్మీడియట్ తోనే ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. పది, ఇంటర్ అర్హతలతో అందుబాటులో ఉన్నటువంటి గవర్నమెంటు ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) :
ప్రభుత్వ ఉద్యోగాల్లో రెవెన్యూ కొలువులకు ప్రాధాన్యం ఉంటుంది. తొందరగా ఎదగడానికి అవకాశం ఉండటం వలన అభ్యర్థులు రెవెన్యూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే విలేజ్ రెవెన్యూ అసిస్టెంటు అయిన వీఆర్‌ఏ ఉద్యోగాలకు ఉన్నత విద్యావంతులు సైతం పోటీ పడుతుండటం విశేషం. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి విద్యార్హత పదోతరగతి ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టే రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జిల్లా స్థానికత చూసి ఖాళీల భర్తీ జరుగుతుంది. (10th And Inter Based Govt Jobs)

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్‌వో) :


తెలుగు రాష్ట్రాల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే వీఆర్‌వో ఉద్యోగాలకు మంచి క్రేజ్ ఉంది. జిల్లా ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హత ఇంటర్మీడియట్ గా ఉంది. ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వీఆర్‌వో ఉద్యోగాన్ని పొందవచ్చు. వారి ఎంపిక రాత పరీక్ష ఆధారంగానే ఉంటుంది. ఇప్పటి వరకూ కూడా ఈ విధానము ప్రకారంగా వీఆర్‌ఏ, వీఆర్‌వో ఉద్యోగాలకు వంద మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపులోనే ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత కూడా ఆయా విద్యార్హతల రీతిలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు.

గ్రూప్ 4 :
తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు చాలా ప్రభుత్వ శాఖలల్లో జూనియర్ అసిస్టెంట్, క్లర్కు స్థాయి ఉద్యోగాల భర్తీలకి గ్రూప్-4 నోటిఫికేషన్లను విడుదల చేస్తాయి. శాఖల వారీగా ఉద్యోగాల ప్రకటనల విడుదల చేసే సమయంలో కూడా గ్రూప్-4 కేడర్ ఉద్యోగాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్-4లో 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైతే ఇందుకు అవకాశం ఉంటుంది. కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్ తో పాటుగా అదనపు అర్హతలు కూడా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ వంటి నైపుణ్యాలు కూడా ఉంటాయి. ఆ నిబంధనలు నోటిఫికేషన్‌లో చేర్చుతుండటం విశేషం. కాబట్టి అభ్యర్థులు ఏదైనా కంప్యూటర్ కోర్సులో సర్టిఫికెట్లు పొందితే ప్రయోజనం ఉంటుంది. గ్రూప్-4 ఉద్యోగాలను రాత పరీక్ష మార్కుల ఆధారంగా భర్తీ అనేది చేస్తారు. రాత పరీక్షలో వివిధ పోస్టులు అనుసరించి జనరల్ స్టడీస్, సెక్రటేరియల్ ఎబిలిటీస్, సంబంధిత సబ్జెక్టు పేపర్లుతో పాటు ఒక్కో పేపర్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులకు చొప్పున, ప్రతి పేపరుకు రెండున్నర గంటల టైమ్ ను కేటాయిస్తారు(10th And Inter Based Govt Jobs).

పోలీసు ఉద్యోగాలు :
ఇంటర్ ఉత్తీర్ణతతో కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంటుంది పోలీస్ శాఖ. తెలంగాణ, ఏపీలో కానిస్టేబుల్స్ నియామకాలు ప్రక్రియలను వివిధ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులు నిర్వహిస్తాయి. ఇవి సివిల్, ఏఆర్, ఎస్‌పీఎఫ్ వంటి విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాయి. వాటితోపాటుగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ వస్తుంటాయి. వాటికి 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన వారు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులను పొందవచ్చు.

పోలీస్ శాఖతో పాటుగా ఎక్సైజ్ అబ్కారీ, రవాణా శాఖలలో కానిస్టేబుల్ ఉద్యోగాలకూ ఇంటర్ పాస్ అయితే చాలు. ఈ పోస్టులకు కొన్ని శారీరక ప్రమాణాలనేవి ఉండాలి. అబ్కారీ ఉద్యోగాలకు రిటన్ టెస్టు, ఫిజికల్ క్వాలిఫైయింగ్ పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ పరీక్ష ద్వారా వ్యక్తుల ఎంపిక చేస్తారు. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కేవలం రిటన్ టెస్ట్ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మోటారు డ్రైవింగ్ లెసైన్స్ ఉంటేనే అర్హత ఉంటుంది.

పోస్టల్ శాఖ :
పోస్టల్ విభాగంలో మెయిల్‌గార్డ్, పోస్టుమేన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ఈ పోస్టులు సాధించిన వారికి నెలకు రూ.22 వేల జీతంతో పాటుగా స్థానికంగానే పనిచేసే మంచి అవకాశము కలుగుతుంది. రిటన్ టెస్టు ద్వారా పోస్టుల భర్తీ అనేది నిర్వహిస్తారు.
గ్రామీణ్‌ డాక్ సేవక్ జీడీఎస్- బ్రాంచ్ పోస్టు మాస్టరు బీపీఎం, మెయిల్ డెలివరర్ ఎండీ, ప్యాకర్ ఉద్యోగాలకు 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ అనేది జరుగుతుంది.
వెబ్‌సైట్: www.indiapost.gov.in

పారా మిలిటరీలో :
జాతీయ స్థాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్‌ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్‌ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్‌పీఎఫ్, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ ఎస్‌ఎస్‌బీ వంటి వివిధ పారా మిలిటరీ విభాగాలలో కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 23 ఏళ్ల వయసు గల వారు ఈ పోస్టులకు అర్హులుగా చెప్పొచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్ పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ పరీక్ష, రిటన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఎస్‌ఎస్‌సీలో :
కేంద్రంలో అనేక పోస్టుల భర్తీని చేపట్టేటటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్‌ఎస్‌సీ 10వ తరగతి, ఇంటర్ అర్హతతో కొన్ని జాబ్స్ కు కేలండర్ ప్రకారంగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తుంటుంది.

ఎంటీఎస్ :
10వ తరగతి ఉత్తీర్ణతతో మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్, స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 18నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్నవారు ఇందుకు అర్హులుగా చెప్పొచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయస్సు సడలింపు అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారానే నిర్వహిస్తారు.

సీహెచ్‌ఎస్‌ఎల్ :
ఇంటర్ అర్హతతో జాతీయ స్థాయిలో భర్తీ చేసే ఉద్యోగాలలో ముఖ్యమైన నోటిఫికేషన్ ఇదని చెప్పొచ్చు. పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, కోర్టు క్లర్కులు ఇలా వివిధ కీలక పోస్టుల భర్తీ అనేది చేయడానికి ఎస్‌ఎస్‌సీ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ సీహెచ్‌ఎస్‌ఎల్ ప్రకటనలను ఏటా ఎస్‌ఎస్‌సీ విడుదల చేస్తుంది. 18 నుంచి 27 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు. రిజర్వేషన్ నిబంధనల మేరకు గరిష్ట వయస్సు పరిమితితో సడలింపులు అనేవి ఉంటాయి. ఎంపిక ప్రక్రియలో ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆ తర్వాత డిస్క్రిప్టివ్ పేపరు, స్కిల్‌ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ పరీక్షల ఆధారంగానే మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.

స్టెనోగ్రాఫర్ :
ఇంటర్ అర్హతతో మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి ఉద్యోగాల భర్తీని ఎస్‌ఎస్‌సీ చేపడుతుంది. 18-27 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ముందుగా రిటన్ టెస్టు, ఆ తర్వాత స్కిల్ పరీక్షలను చేపడుతారు. స్కిల్ టెస్ట్‌లో 10 నిమిషాల సమయంలో ఒక డిక్టేషన్ ఇస్తారు. దీన్ని గ్రేడ్-సి కేటగిరీ వారు ఇంగ్లిష్, హిందీ భాషలల్లో నిమిషానికి వంద పదాలను కంప్యూటర్‌పై స్టెనోగ్రఫీ చేయాలి. అదే విధంగా గ్రేడ్-డి అభ్యర్థులు ఇంగ్లిష్, హిందీ భాషలల్లో నిమిషానికి 80 పదాలను స్టెనోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని గుర్తించుకోవాలి. రాత పరీక్షలో వచ్చే మార్కులను చివరిగా ఎంపికలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: www.ssc.nic.in

యూపీఎస్సీ: ఎన్‌డీఏ, ఎన్‌ఏ
ఇంటర్ అర్హతతో త్రివిధ దళాల్లో అడుగు పెట్టేందుకు మంచి మార్గం ఏదంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష అని చెప్పొచ్చు. ఇంటర్ అర్హతతో అటు చదువు, ఇటు ఉద్యోగము రెండూ కూడా పొందే అవకాశాన్ని ఈ పరీక్ష ద్వారా లభించే అవకాశం ఉంది. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం రెండుసార్లుగా ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులుగా చెప్పొచ్చు.
వెబ్‌సైట్: www.upsc.gov.in

ఇండియన్ ఆర్మీ :
ఇంటర్మీడియట్ అర్హతతో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాన్ని పొందొచ్చు. ఇంటర్ లో 70 శాతం మార్స్క తో గణితం, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టులు అనేవి చదివిన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులుగా ఉంటారు. ఇంటర్మీడియట్ లో సాధించిన మార్కుల ఆధారముగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. వారికి రెండు దశలల్లో ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టెస్టులు, ఇంటర్వ్యూలనేవి నిర్వహించి ఎంపికలు చేస్తారు. ఈ ఎంట్రీ స్కీమ్ తో ఎంపికైన వారు శిక్షణ అనేది పూర్తయ్యిన తర్వాత ఇంజనీరింగ్ పట్టాతో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని పొందుతారు.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in

ఇండియన్ నేవీ :
భారత నావికాదళం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులకు అకడెమిక్ సర్టిఫికెట్లతోపాటు అద్భుతమైన కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది.
ఇంటర్ క్యాడెట్ బీటెక్ ఎంట్రీ స్కీమ్: ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌లో 70 శాతం మార్కులతో పాస్ అయిన వారు ఇండియన్ నేవీ ఆఫర్ చేసే 10+2 క్యాడెట్ బీటెక్ ఎంట్రీ స్కీమ్‌కు అర్హులుగా చెప్పొచ్చు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులకు ఎంపిక అనేది చేసే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

ఎయిర్‌ఫోర్స్ :
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇంటర్ అర్హతతో గ్రూప్-ఎక్స్ టెక్నికలు, గ్రూప్-వై పేర్లతో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్ లో 50 శాతం మార్క్స్ తో ఎంపీసీ గ్రూపు ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాల్సిందే. గ్రూప్-ఎక్స్ టెక్నికల్ ఉద్యోగాలకు మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్, ఐటీలలో మూడేళ్ల డిప్లొమా పాసైన వారు ఇందులో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఈ విభాగానికి ఎంపికైన అభ్యర్థులు ఎయిర్‌ఫోర్స్‌లోని కొన్ని సాంకేతిక విభాగాలల్లో ఎయిర్‌మెన్‌గా నియమించే అవకాశం ఉంటుంది. రిటన్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ పరీక్ష, మెడికల్ పరీక్ష విభాగాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
వెబ్‌సైట్: https://careerindianairforce.cdac.in

ఆర్‌బీఐలో ఉద్యోగాలు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐలో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలను 10వ తరగతి పాస్ అయిన వారితో భర్తీ చేస్తుంది. జాతీయ స్థాయిలో పరీక్ష, తర్వాత భాషా నైపుణ్య టెస్టులు చేపడుతుంది. దానికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులుగా ఉంటారు. టెస్టులో చూసినట్లైతే రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అనేవి ఉంటాయి. గత సంవత్సరం నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రశ్నాపత్రంలో ఒక్కో విభాగము నుంచి 30 చొప్పున మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులకు ఇవ్వడం జరిగింది. ఈ టెస్టు సమయం 90 నిమిషాలుగా ఉంటుంది.
వెబ్‌సైట్: www.rbi.org.in

Previous articleవరుడు అరగంటలో తాళి కడతాడు …కానీ పెళ్లి కూతురు చేసిన పనికి ఊరంతా షాక్
Next articleసిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌..రాంగ్ కాల్స్‌కు చెక్‌ పెట్టే సరికొత్త యాప్‌