Home Technology హార్లే డేవిడ్ సన్ నుంచి ఎలక్ట్రిక్ బైక్

హార్లే డేవిడ్ సన్ నుంచి ఎలక్ట్రిక్ బైక్

174
0
Harley Davidson Launched Electric Bike
Harley Davidson Launched Electric Bike

లైవ్‌వైర్ వన్ పేరుతో హార్లే డేవిడ్సన్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ను మార్కెట్ లోకి తీసుకురావాలని సంస్థ రెండేళ్ల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో దీని ధర రూ.22.24 లక్షలుగా ప్రకటించగా, దానిని సవరించి ప్రస్తుతం రూ.16.42 లక్షలకే అందించనున్నట్లు ప్రకటించింది. సాంప్రదాయ ఇంధన వనరుల ధరలు నానాటికీ పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పనపై పలు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే హార్లే డేవిడ్ సన్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ లైవ్‌వైర్ వన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీనిలో అధునాతన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సౌకర్యాలు ఉంటాయని సంస్థ చెప్పినప్పిటికీ సంబంధిత వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఎలక్ట్రిక్ మార్కెట్ లో తమ బ్రాండ్ విలువ మరింత పెరిగేందుకు కృషి చేస్తున్నామని, తమ లైవ్ వైర్ వన్ బైక్ ను అత్యాధునికంగా తీర్చుదిద్దినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. లైవ్ వైర్ వన్ రూపకల్పనను తమ బ్రాండ్ యొక్క తదుపరి అధ్యాయమని హార్లే-డేవిడ్సన్ చైర్మన్, ప్రెసిడెంట్ మరియు సిఇఒ జోచెన్ జైట్జ్ అన్నారు.

లైవ్‌వైర్ వన్ నాలుగు ప్రీ-సెట్ రైడ్ మోడ్‌లతో రానుంది. దీని పునరుత్పాదక బ్రేకింగ్ ప్రతి మోడ్‌కు అనుకూలంగా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను వ్యక్తిగత రైడర్ అవసరాలకు అనుగుణంగా, తక్కువ, మధ్యస్థ, ఉన్నత శ్రేణులలో శుద్ధి చేయవచ్చు. బైక్ యొక్క ఎలక్ట్రిక్ మోటారు 75 కిలో వాట్లు, 17 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 235 కిలోమీటర్ల పటు ప్రయాణించవచ్చు.
హార్లే డేవిడ్ సన్ లైవ్ వైర్ వన్ కు ఇంట్లో ఛార్జింగ్ పెడితే 11 గంటల్లో 100 శాతం పూర్తి ఛార్జ్ అవుతుంది. అదే డీసీ ఫాస్ట్ చార్జర్ తో అయితే ఒక గంటలోనే పూర్తి ఛార్జ్ చేయొచ్చు. కేవలం 3 సెకన్లలో 0 నుంచి 97 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది. ఇక 1.9 సెకన్లలో 100 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. లైవ్‌వైర్ వన్‌లో హార్లే-డేవిడ్సన్ బ్రాండింగ్ ఉన్నట్లు అనిపించదు. బదులుగా బాడీవర్క్‌లో లైవ్‌వైర్ బ్రాండింగ్ ఉంది. దీనిని ప్రస్తుతం అమెరికా మార్కెట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్ మార్కెట్ లో ఇది రావాలంటే మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది.

Previous article‘ఉక్కు’ సంకల్పంతో.. ఉధృతంగా..
Next articleనేనూ.. లవ్ ఫెయిల్యూర్ నే : అనుపమ పరమేశ్వరన్