Home జాతీయ వార్తలు హత్యాచార బాలిక కుటుంబానికి రాహుల్ గాంధీ పరామర్శ

హత్యాచార బాలిక కుటుంబానికి రాహుల్ గాంధీ పరామర్శ

393
0
Rahul Gandhi meets family
Rahul Gandhi meets family

హత్యాచార బాలిక కుటుంబానికి రాహుల్ గాంధీ పరామర్శ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య అనంతరం బలవంతంగా దహనం చేసిన అమానుష ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. బాధిత దళిత బాలిక మృతికి న్యాయం చేయాలని కోరుతూ నిరసనలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ఉదయం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. తాను బాధిత కుటుంబంతో మాట్లాడానని, వారు న్యాయం తప్ప మరేమీ కోరుకోవడం లేదని చెప్పారు. తాను వారికి అండగా ఉంటానని, న్యాయ సహాయం అందేలా చూస్తానని హామీ నిచ్చారు. “బాలిక తల్లి, తండ్రి కన్నీళ్లు ఒక్క విషయం మాత్రమే చెబుతున్నాయి.. వారి కుమార్తె ఈ దేశపు కుమార్తె. వారికి నీయం అందే మార్గంలో వారికి తోడుగా ఉంటా” అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉంది. కేసులో నిందితులుగా భావిస్తున్న శ్మశానవాటికలో పూజారి రాధే శ్యామ్ (55), మరో ముగ్గురు ఉద్యోగులు – కుల్దీప్ కుమార్ (63), లక్ష్మీ నారాయణ్ (48), మొహమ్మద్ సలీం (49) లను సోమవారం అరెస్టు చేశారు.
ఆదివారం సాయంత్రం, బాలిక తన ఇంటికి సమీపంలో ఉన్న శ్మశానవాటిక వద్ద కూలర్ నుండి నీరు తీసుకోవడానికి వెళ్లింది. సుమారు 30 నిమిషాల తర్వాత పూజారి రాధే శ్యామ్, మరో ఇద్దరు-ముగ్గురు వ్యక్తులు బాలిక తల్లికి ఫోన్ చేశారు. నీరు వస్తుండగా విద్యుదాఘాతానికి గురైనట్లు బాలిక మృతదేహాన్ని చూపించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తమ కుమార్తె శరీరాన్ని దహనం చేయడానికి బలవంతం చేశారని, తన కుమార్తె హత్యకు ముందు అత్యాచారానికి గురైందని అనుమానిస్తున్నట్లు బాలిక తల్లి ఆరోపించింది. బాలిక మృత దేహాన్ని దహనవాటికపై వెలిగించే ముందు తన అనుమతి తీసుకోలేదని మహిళ వివరించింది. తాను అరవడం చూసి సమీప ప్రాంతాలకు చెందిన వారు సహాయానికి వచ్చారన్నారు. తాము మంటలను ఆర్పగా, తమ కుమార్తె కాళ్ళు మాత్రమే మిగిలాయన్నారు. బాలిక అవశేషాలను పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపారు, అయితే మరణానికి కారణాన్ని పరిశీలించడానికి మెడికల్ బోర్డ్ ఏర్పడిందని, దానికి కారణాన్ని గుర్తించలేకపోతున్నామని పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం.

For latest News

Previous articleటోక్యో ఒలింపిక్స్ : బాక్సింగ్ లో కాంస్యం సాధించిన లవ్లీనా
Next articleనెలకు 10 వేల డాలర్లు ఇస్తాం : యూట్యూబ్ ప్రకటన