Home జాతీయ వార్తలు సైబర్ అంతరిక్ష దాడులను ఎదుర్కొనే సాంకేతికత అవసరం : రాష్ట్రపతి కోవింద్

సైబర్ అంతరిక్ష దాడులను ఎదుర్కొనే సాంకేతికత అవసరం : రాష్ట్రపతి కోవింద్

278
0
Cyber, space threats require upgraded technological responses: President Ram Nath Kovind
Cyber, space threats require upgraded technological responses: President Ram Nath Kovind

సైబర్ అంతరిక్ష దాడులను ఎదుర్కొనే సాంకేతికత అవసరం : రాష్ట్రపతి కోవింద్సై బర్ దాడులు, అంతరిక్షంలో పెరుగుతున్న బెదిరింపులకు అత్యాధునిక సాంకేతిక ప్రతిస్పందనలు అవసరమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం అన్నారు. వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో రాష్ట్రపతి కోవింద్ ప్రసంగించారు. వాతావరణ మార్పు వంటి అంశాలు భద్రతా సన్నద్ధతపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సమస్యలన్నీ దేశ భద్రతను ప్రభావితం చేస్తాయని, చిక్కులను అర్ధం చేసుకుంటే వాటిని ఎదుర్కోవచ్చని చెప్పారు. దేశంలోని అత్యున్నత రక్షణ సంస్థలో గణనీయమైన మార్పులు ఏర్పడ్డాయని, రక్షణ రంగంలో స్వదేశీకరణ, స్వయం సమృద్ధికి కూడా ప్రోత్సాహం అందించబడుతోందని ఆయన అన్నారు. సాయుధ దళాల భవిష్యత్తును సిద్ధం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అవిశ్రాంత ప్రయత్నాలు, గొప్ప త్యాగాల ద్వారా తోటి పౌరుల గౌరవాన్ని పొందారని పేర్కొంటూ భారత సాయుధ దళాలను ఆయన ప్రశంసించారు. యుద్ధం, శాంతి సమయంలో వారు దేశానికి అమూల్యమైన సేవలను అందించారు. అంతర్గత, బాహ్య భద్రతా సవాళ్లు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారు అంకితభావం, ధైర్యంతో తమ విధులను నిర్వర్తించారు కొనియాడారు. కోవిడ్ -19 మహమ్మారితో పాటు సరిహద్దుల్లోని పరిస్థితులను ఎదుర్కోవడంలో సాయుధ దళాల పురుషులు, మహిళలు ప్రదర్శించిన అత్యుత్తమ సంకల్పాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు.
కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఆయన ఇటీవల కాశ్మీర్ లోయను సందర్శించడం గురించి మాట్లాడారు. సైనికుల అత్యున్నత ధైర్యాన్ని, విధి పట్ల అంకిత భావాన్ని గమనించినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆయన చెప్పారు. భారతదేశం జాతీయ భద్రత, రక్షణ భావనలు కూడా మారుతున్నాయని అన్నారు. భౌగోళిక-వ్యూహాత్మక, భౌగోళిక-రాజకీయ నిర్బంధాలు మరియు అనేక ఇతర అంశాలు భద్రతా దృశ్యాన్ని మరింత క్లిష్టతరం చేశాయని చెప్పారు. సంఘర్షణలు, తీవ్రవాద నిరోధం, యుద్ధేతర వివాదాలు ఇలా అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
డిఫెన్స్ ప్రొఫెషనల్స్‌గా ఉండే వారు మేధో పరంగా యోధుడిగా ఉండాలని ఆయన యువ అధికారులకు చెప్పారు. “మీరు గత అనుభవాలపై ఆధారపడి ఉంటారు, అలాంటి అభ్యాసాన్ని ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా మార్చండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండటానికి మీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి” అని రాష్ట్రపతి అన్నారు.

For latest News

Previous articleబొమ్మాయి మంత్రివర్గంలో 29 మంది
Next articleఅయోధ్య రామమందిరంలో భక్తుల ప్రవేశం.. 2023 డిసెంబర్ లోనే!