Home సినిమాలు సెప్టెంబర్ 10న దసరా కానుకగా ‘లవ్ స్టోరీ’

సెప్టెంబర్ 10న దసరా కానుకగా ‘లవ్ స్టోరీ’

585
0
Naga Chaitanya And Sai Pallavi Starrer Love Story Release Date Is Out
Naga Chaitanya And Sai Pallavi Starrer Love Story Release Date Is Out

సెప్టెంబర్ 10న దసరా కానుకగా ‘లవ్ స్టోరీ’ లాక్‌డౌన్ తర్వాత, మరోసారి థియేటర్లలో సందడి కనిపిస్తోంది. కఠినమైన లాక్డౌన్ ఎదుర్కొన్న తర్వాత నెమ్మదిగా మేకర్స్ తమ సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను థియేటర్లకు చేరుకునేలా చేస్తున్నారు. గత రెండు నెలల్లో పెద్ద స్క్రీన్‌లపై ఇప్పటి వరకు కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. క్రమంగా కొన్ని పెద్ద సినిమాలు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఎన్నో సినిమాలు వెండి తెరపై అలరించనున్నాయి. ఈ క్రమంలో లవ్ స్టోరీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా పేజీలో కొత్త పోస్టర్‌ను షేర్ చేయడంతో పాటు విడుదల తేదీని ప్రకటించారు.

లవ్ స్టోరీ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని చైతన్య కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. సినిమా విడుదల తేదీని ప్రకటించి, తన అభిమానులకు శుభవార్త చెప్పారు. చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ కొత్త పోస్టర్‌లో చేతులు పట్టుకుని అద్భుతంగా కనిపించారు. విడుదల తేదీని ప్రకటించిన చైతన్య ఈ వినాయక చవితి తమకు మరింత ప్రత్యేకమని, ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న లవ్ స్టోరీ సెప్టెంబర్ 10న మీ సమీపంలోని థియేటర్లలో విడుదలవుతుందని ఆయన ప్రకటించారు.

సాయి పల్లవి కూడా అదే పోస్టర్‌ను షేర్ చేసి, విడుదల తేదీని ప్రకటించడం పట్ల తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. రొమాంటిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్, కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే నాగ చైతన్య ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకున్నాడు. ఈ సినిమాలో ఉండే సారంగ దరియా పాట యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. ఇప్పటి వరకు 30,70,74,023 వ్యూస్ దక్కించుకుంది.

Previous articleశశిథరూర్ పై అభియోగాలు కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
Next articleబాక్సాఫీసు వద్ద తలపడనున్న మెగా హీరోలు