Home సినిమాలు సురేఖ సిక్రీ కన్నుమూత.. విషాదంలో బుల్లి తెర వీక్షకులు

సురేఖ సిక్రీ కన్నుమూత.. విషాదంలో బుల్లి తెర వీక్షకులు

158
0
Surekha Sikri Died
Surekha Sikri Died

జాతీయ అవార్డు గ్రహీత నటి సురేఖా సిక్రీ గుండెపోటు కారణంగా శుక్రవారం ఉదయం మరణించారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. సురేఖా సిక్రీ కి రెండేళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తాజాగా రెండోసారి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు, గుండె పోతూ రావడంతో కన్నుమూశారు. సురేఖా సిక్రీకి 2019 లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు, సెప్టెంబరులో ఒక ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించింది. బదాయి హో చిత్రానికి గాను జాతీయ అవార్డు గెలుచుకున్న తరువాత, సురేఖా సిక్రీ తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు.

తాను మహాబలేశ్వరంలో షూటింగ్ చేస్తున్నపుడు, బాత్ రూములో జారి పడినప్పుడు తలకు దెబ్బ తాతగిలిందని చెప్పారు. అప్పుడు తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు. త్వరలోనే కోలుకుంటానని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.
2019 లో సురేఖా సిక్రీకి బదాయి హో చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు వరించింది. 1988 లో తమస్ చిత్రానికి, 1995లో మమ్మో చిత్రానికి జాతీయ అవార్డులను అందుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి పట్టభద్రుడైన సురేఖా సిక్రీ.. 1989 లో సంగీత నాటక్ అకాడమీ అవార్డుతో ఆమెను సత్కరించారు.
హిందీలో బాలికా వధు సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు పేరుతో అనువాదం అయింది. తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ సీరియల్ లో ఆమె పాత్రను మన ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆమె మరణంతో తెలుగు సీరియల్ వీక్షకులు విషాదంలో మునిగి పోయారు.

Previous articleజలదిగ్బంధనంలో.. భాగ్య నగరం
Next articleఛలో రాజభవన్.. కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు