Home జాతీయ వార్తలు సుప్రీం చెప్పిన కొన్ని గంటల్లోనే.. రైతులపై దేశద్రోహం కేసు!

సుప్రీం చెప్పిన కొన్ని గంటల్లోనే.. రైతులపై దేశద్రోహం కేసు!

157
0
100 Farmers Face Sedition Case in Sirsa in Haryana
100 Farmers Face Sedition Case in Sirsa in Haryana

రాజద్రోహం ఐపీసీ 124-ఏ రద్దు చేయాలనే విషయంపై కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చి కొన్ని గంటలైనా గడవక ముందే.. రైతులపై దేశ ద్రోహం కేసు నమోదైన ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలో పలకపక్షమైన బిజెపి-జన్నాయక్ జనతా పార్టీ కూటమి సభ్యులకు, రైతులకు మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకుంది. వివాదాస్పదమైన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా అధికారిక వాహనం అటుగా వెళ్తుండడంతో ఆగ్రహంతో ఉన్న రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 100 మందికి పైగా రైతులపై హర్యానా పోలీసులు దేశద్రోహ అభియోగాలు మోపారు. ఈ సంఘటన జూలై 11న హర్యానాలోని సిర్సా జిల్లాలో చోటుచేసుకుంది. అదే రోజునే ఎఫ్ఐఆర్ దాఖలైంది. దేశద్రోహమే కాకుండా, రైతులపై ‘హత్యాయత్నం’ అని కూడా అందులో నమోదు చేశారు.

రైతు ఉద్యమానికి చెందిన ఇద్దరు నాయకులు హరి చరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు అయ్యాయి. దీనిపై సంయుక్త్ కిసాన్ మోర్చా సభ్యులు ప్రకటన విడుదల చేశారు. పోలీసులు తమపై నమోదు చేసిన ఆరోపణలను తప్పుడు, పనికి రాని, వండి వార్చిన వాటిగా అభివర్ణించారు. వాటిపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని చెప్పారు. రైతులంతా సిర్సాలో హర్యానా డిప్యూటీ స్పీకర్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినందుకే కేసులు నమోదు అయ్యాయని వారు పేర్కొన్నారు. దేశద్రోహం, రాజద్రోహం చట్టాన్ని సుప్రీం కోర్టు వలస చట్టంగా అభివర్ణించిన కొన్ని గంటల్లోనే ఈ కేసు వెలుగులోకి రావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన వలస పాలకుల చట్టాలు అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని ప్రజలపై బలవంతంగా రుద్ది, వారి భావ ప్రకటన స్వేచ్ఛను హరించే అవకాశం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని రద్దు చేసే అవకాశాలను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Previous articleచైనా దుర్బుద్ధి.. వాస్తవాధీన రేఖ వెంట కాంక్రీటు నిర్మాణాలు
Next articleజలదిగ్బంధనంలో.. భాగ్య నగరం