Home విద్య సిబిఎస్ఇ ఫలితాలు విడుదల

సిబిఎస్ఇ ఫలితాలు విడుదల

658
0
CBSE 12th Results Released
CBSE 12th Results Released

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్లస్ టు (12వ తరగతి) ఫలితాలను విడుదల చేసింది.
సిబిఎస్ఇ ప్లస్ టు (12వ తరగతి) విద్యార్థులు cbseresults.nic.in, cbse.gov.in వెబ్ సైట్ లను సందర్శించడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది అంతర్గత మార్కుల ఆధారంగా ప్లస్ టు విద్యార్థుల ఫలితాలను ప్రకటిస్తూ సిబిఎస్ఇ నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షను నిర్వహించకుండా ఫలితాలను విడుదల చేయడం సిబిఎస్ఇ చరిత్రలో ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు వారి సిబిఎస్ఇ ఫలితాన్ని ఎస్ఎంఎస్ ద్వారా కూడా పొందొచ్చు. ఇది వారి రిజిస్టర్డ్ మొబైల్, ఇ మెయిల్ లకు సందేశం వస్తుంది. మొబైల్ నుంచి 7738299899 కు SMS పంపడం ద్వారా కూడా ఫలితం పొందవచ్చు. దీనికి గాను CBSE12_(రోల్ నం) _ (అడ్మిట్ కార్డ్ ID) టైపు చేసి 7738299899 కి ఎస్ఎమ్ఎస్‌ పంపాలి.
ఈ ఏడాది సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షలకు 16 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 10, 11, 12 తరగతుల్లో అంతర్గత పరీక్షల ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తూ సిబిఎస్ఇ చర్యలు తీసుకుంది.

Students Results Checking
Students Results Checking

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పరీక్షలను రద్దు చేసి, అంతర్గత పరీక్షలలో మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించడంపై సిబిఎస్ఇ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆగష్టు 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించే విధంగా ఈ పథకాన్ని సమీక్షించాలని పిటిషన్లో వారు కోరారు. సిబిఎస్ఇ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని సుప్రీం తలుపు తట్టారు. అయితే వారి వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సిబిఎస్ఇ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెబుతూ జూన్ 22న తీర్పునిచ్చింది. పిటిషన్‌తో పాటు దానికి మద్దతుగా ఉన్న కారణాలను కూడా పరిశీలించామని, తమ అభిప్రాయం ప్రకారం, సమీక్ష కోసం ఆదేశాలివ్వడం కుదరదని పేర్కొంటూ జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులో తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేయబడ్డాయి. తల్లిదండ్రుల సంఘంతో పాటు విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల ప్రకారం 13,04,561 లక్షల మంది సిబిఎస్ఇ పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వారిలో 1296318 మంది ఉత్తీర్ణత సాధించారు.

Previous articleపెగాసస్ వివాదం.. విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
Next articleటోక్యో ఒలింపిక్స్: సెమీస్ లో పివి సింధు