Home విద్య సిబిఎస్ఇ ‘పది’ ఫలితాలు విడుదల

సిబిఎస్ఇ ‘పది’ ఫలితాలు విడుదల

570
0
Students Results Checking
Students Results Checking

సిబిఎస్ఇ ‘పది’ ఫలితాలు విడుదల సిబిఎస్ఇ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ ఫలితాలను మంగళ వారం మధ్యాహ్నం 12 గంటలకు తమ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. విద్యార్థులంతా సిబిఎస్ఇ బోర్డ్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లైన cbseresults.nic.in, cbse.gov.in లను సందర్శించవచ్చు. సిబిఎస్ఇ 10వ తరగతి ఫలితాలను డిజిలాకర్ ఖాతా ద్వారా తనిఖీ చేయవచ్చు.
ఈ సంవత్సరం కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ దృష్ట్యా సిబిఎస్ఇ 10 వ తరగతి బోర్డ్ పరీక్షలు రద్దు చేయబడ్డాయి. సిబిఎస్ఇ 10వ తరగతి ఫలితాలను బోర్డు నిర్దేశించిన మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి లెక్కించారు. 10 వ తరగతి విద్యార్థులకు, 80:20 మార్కింగ్ ప్రమాణాలతో ఫలితాలను నిర్దేశించారు. ఇక్కడ 80 శాతం వెయిటేజీని అంతర్గత యూనిట్ పరీక్షలు, మిగిలిన 20 శాతం ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వర్క్ కోసం కేటాయించారు. ఈ నెల 20వ తేదీన ఫలితాలు ప్రకటించడానికి సిబిఎస్ఇ ప్రణాళికలు చేపట్టింది. అయితే దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థుల ఫలితాలు రావడంలో జాప్యం చోటు చేసుకుంది. ఫలితంగా సిబిఎస్ఇ ‘పది’ ఫలితాలు మంగళ వారం విడుదలయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సిబిఎస్ఇ పరీక్షలు నిర్వహించకుండా ఫలితాలను ప్రకటించాల్సి వచ్చింది. పరీక్షలు చేపట్టకపోవడంతో అంతర్గత పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను విడుదల చేసింది.

For latest News

Previous articleపెగాసస్ : ప్రతిపక్షాలతో రాహుల్ గాంధీ సమావేశం
Next articleవిశాఖ ఉక్కు : ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు