Home జాతీయ వార్తలు సిద్ధూ ప్రమాణ స్వీకారానికి అమరీందర్.!

సిద్ధూ ప్రమాణ స్వీకారానికి అమరీందర్.!

272
0
CM Amarinder will attend New Punjab PCC Swearing
CM Amarinder will attend New Punjab PCC Swearing

ఎట్టకేలకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ తన పంతాన్ని పక్కన పెట్టారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ తో ఉన్న విభేదాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా ఆయన ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ హాజరు కారేమోనన్న ఊహాగానాలను తెరదించారు. తన ప్రమాణ స్వీకారానికి వచ్చి, పంజాబ్ కాంగ్రెస్ నూతన జట్టును ఆశీర్వదించాలని సిద్ధూ లేఖ రాశారు. తన సన్నిహితులతో చర్చించిన అనంతరం ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి ముఖ్యమంత్రి అమరీందర్ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్ గా నవజోత్ సింగ్ సిద్దూ, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లతో కూడిన జట్టు ప్రమాణ స్వీకారం రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన మద్దతుదారులతో పాటు హాజరుకానున్నారు. రేపు పంజాబ్ భవన్‌లో పార్టీ నాయకులను టీకి ఆహ్వానించిన అమరీందర్… ఆ తర్వాత వారు పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

Punjab PCC Chief Sidhu
Punjab PCC Chief Sidhu

సోనియా గాంధీ తన నియామకాన్ని చేపట్టిందని, తనకు వ్యక్తిగత ఎజెండా లేదు, ప్రజల అనుకూల ఎజెండా మాత్రమే ఉందని ముఖ్యమంత్రి అమరేందర్ కు రాసిన లేఖలో సిద్ధూ పేర్కొన్నారు. పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలో పెద్దవాడిగా మీరు వచ్చి కొత్త పీసీసీ జట్టును దీవించాలంటూ సిద్ధూ అభ్యర్ధించారు. అనంతరం దీనిపై ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ట్వీట్ చేశారు. పంజాబ్ సిఎం శుక్రవారం ఉదయం 10 గంటలకు పంజాబ్ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలకు తేనీటి విందు ఇవ్వనున్నారని, అనంతరం వారంతా కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్ కు వెళతారని ట్వీట్ లో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి అమరీందర్ ను పీసీసీ కొత్త టీం సభ్యులు కొందరు కలుసుకున్నారు. సంబంధిత చిత్రాలను వారు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే కలిసిన వారిలో సిద్ధూ లేకపోవడం గమనార్హం. ఇరువురికీ విభేదాలు వచ్చిన తర్వాత మొదటిసారి శుక్రవారం కలుసుకునే అవకాశం ఉంది. గతంలో తనపై పెట్టిన అవమానకరమైన ట్వీట్లకు సిద్ధూ నుంచి ముఖ్యమంత్రి అమరీందర్ బహిరంగ క్షమాపణలు కోరారు. ఆయన మద్దతుదారులు కూడా సిద్ధూను బిజెపి తిరస్కరించిన వ్యక్తిగా అభివర్ణించారు. ఇటువంటి తరుణంలో సిద్ధూ ప్రమాణ స్వీకారానికి అమరీందర్ వెళ్లడానికి నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీ వర్గాల్లో సంతోషం రేకెత్తించింది.
అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్దూ మధ్య వివాదం 2017 రాష్ట్ర ఎన్నికల నుంచి కొనసాగుతోంది. బిజెపిలో పనిచేసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తనను ఉప ముఖ్యమంత్రిగా చేస్తారని సిద్ధూ ఆశించారు. కానీ ఈ చర్యను కెప్టెన్ అమరీందర్ అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో ముఖ్యమంత్రిని సిద్ధూ బహిరంగంగానే విమర్శించారు.

Previous articleఫైబర్.. అధికంగా ఉండే పదార్ధాలివే..
Next articleసహాయ చర్యలు ముమ్మరం చేయండి : కెసిఆర్