Home జాతీయ వార్తలు సరిహద్దులో మాటు వేసిన డ్రాగన్

సరిహద్దులో మాటు వేసిన డ్రాగన్

181
0
China heightens activity along LAC in Uttarakhand
China heightens activity along LAC in Uttarakhand

ఉత్తరాఖండ్‌లోని బారాహోతి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనిక కార్యకలాపాలను పెంచింది. ఈ ప్రాంతంలో చైనా కదలికలు ఆరు నెలల విరామం తర్వాత కనిపించాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) చెందిన 40 మంది సైనికులు ఇటీవల బారాహోతి వద్ద ఎల్‌ఐసి వెంట పెట్రోలింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. బారాహోతిలోని ఎల్‌ఎసి వెంట 40 మంది చైనా ఆర్మీ దళాలు బారాహోతి ప్రాంతానికి వచ్చాయని, చాలా కాలం తరువాత ఈ ప్రాంతంలో పిఎల్‌ఎ దళాలు కనిపించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఎల్‌ఎసి వెంట ఇటీవలి పరిణామాల దృష్ట్యా, సమీప భవిష్యత్తులో చైనా సైనిక కార్యకలాపాలు అధికమవ్వొచ్చని, అయితే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్తోంది. బారాహోతి సమీపంలోని చైనా తన వైమానిక స్థావరంలో డ్రోన్లు, సైనిక హెలికాప్టర్లు పనిచేస్తున్నాయని భారత సైన్యం తెలిపింది. లడఖ్ లాంటి ఘటన పునరావృతం కాకుండా నివారించడానికి గతేడాది ఉత్తరాఖండ్‌లోని భారత్ తన దళాలను మోహరించింది.బరాహోతి పలుమార్లు చైనా నుంచి అతిక్రమణ యత్నాలను ఎదుర్కొంది. ఈ ప్రాంతాన్ని కూడా తమదేనని చైనా వాదిస్తోంది. ఇటీవల, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, సెంట్రల్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వై డిమ్రీ సరిహద్దు వెంట భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఇందులో ఉత్తరాఖండ్‌లోని ఎల్‌ఐసి వెంట ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. గతేడాది మే ప్రారంభం నుంచి తూర్పు లడఖ్‌లోని పలు ప్రాంతాలలో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వరుస సైనిక, దౌత్య చర్చల తరువాత ఫిబ్రవరిలో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి దళాలు, ఆయుధాల ఉపసంహరణను ఇరుపక్షాలు పూర్తి చేశాయి. ఇదే ప్రక్రియను మిగిలిన ప్రాంతాల్లో అమలు చేసేలా ఇరు దేశాలకు చెందిన సైనిక, దౌత్య వర్గాలు నిమగ్నమై ఉన్నాయి.

Previous articleపెగాసస్ కు వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ ఏకం కావాలి : మమతా బెనర్జీ
Next articleపెగాసస్ దుర్వినియోగంపై కమిటీ : ఇజ్రాయేల్