Home జాతీయ వార్తలు సరిహద్దులో ఇద్దరు పాక్ చొరబాటుదారులు కాల్చివేత

సరిహద్దులో ఇద్దరు పాక్ చొరబాటుదారులు కాల్చివేత

271
0
Pakistan intruders shot dead by BSF
Pakistan intruders shot dead by BSF

పంజాబ్ సరిహద్దు జిల్లా ఫిరోజ్‌పూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు చొరబాటుదారులను భారత సైనికులు కాల్చి చంపినట్లు సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) శనివారం తెలిపింది. జూలై 30 న రాత్రి 8.48 గంటల సమయంలో, ఫిరోజ్‌పూర్‌లోని థెకెలాన్ (అమర్‌కోట్) లో మోహరించిన బిఎస్‌ఎఫ్ దళాలు భారత భూభాగంలోకి చొరబడిన చొరబాటుదారుల అనుమానాస్పద కదలికను గమనించారు. దళాలు వారిని ఆగిపోవాలని సూచించాయి. అయితే భద్రత దళాల మాటలను చొరబాటుదారులు లెక్క చేయ లేదు. చొరబాటుదారులు పదేపదే హెచ్చరికలను పట్టించుకోలేదు. సరిహద్దు కంచెని దాటడానికి ప్రయత్నిస్తూ భారతదేశం లోకి రావడానికి యత్నించారు. దాంతో పాటు భద్రత దళాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో బిఎస్ఎఫ్ దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు చొరబాటుదారులను మరణించారు. భారత్ లోని పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్‌తో 553 కిమీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది.

Previous articleచికెన్ పాక్స్ లా వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియెంట్ : అమెరికా అధ్యయనంలో వెల్లడి
Next articleపుల్వామా ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం