Home సినిమాలు సంక్రాంతికి రాధేశ్యామ్.. జనవరి 14న విడుదల

సంక్రాంతికి రాధేశ్యామ్.. జనవరి 14న విడుదల

590
0
Radhe Syam New Release Date Announced
Radhe Syam New Release Date Announced

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 2022 జనవరి 14న రాధే శ్యామ్ భారీ స్క్రీన్‌లలోకి రాబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ప్రభాస్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
“నా రొమాంటిక్ చిత్రం రాధేశ్యామ్ చూడటానికి మీరందరూ వేచి చూస్తున్నారని తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 2022 జనవరి 14న సినిమా విడుదల కానుంది” అంటూ చిత్రం విడుదల విశేషాలను ప్రభాస్ తన అభిమానులతో స్వయంగా పంచుకున్నారు.
రాధే శ్యామ్ ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అన్న విషయం తెలిసిందే. సాహో చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తరువాత సరికొత్త పీరియాడికల్ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సరికొత్త కథలో తమ అభిమాన హీరోను చూసేందుకు డార్లింగ్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఉవ్వీళ్ళూరుతున్నారు. ఈ సినిమాను తొలుత 2021 జులై 30న విడుదల చేయాలని అనుకున్నా, కోవిడ్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో రిలీజ్ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది.

ప్రభాస్ ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కొత్తగా విడుదల చేసిన పోస్టర్ లో బ్రీఫ్‌కేస్ పట్టుకుని నీలిరంగు సూట్‌లో దర్శనమిచ్చాడు. బ్యాక్‌డ్రాప్‌లోని ఆధ్యాత్మిక ఖగోళ సంకేతాలతో పాటు పొడవైన టవర్‌లతో ఉన్న రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ, మురళి శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, సత్యన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపతి, ప్రసీద ఉప్పలపతి బ్యాంక్రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణం రాజు సమర్పిస్తారు మరియు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో రూపొందుతోంది.
పీరియడ్ రొమాన్స్ చిత్రం కావడంతో, ఈ కథ 1970 ల నేపథ్యంలో సెట్ చేయబడింది. జస్టిన్ ప్రభాకరన్ తన అద్భుతమైన, మధురమైన బాణీలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, ఇటలీ మరియు జార్జియాలోని అందమైన మరియు సుందరమైన ప్రదేశాలలో జరిగింది. ఈ సినిమా 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది.

Previous articleక్వార్టర్ ఫైనల్ లో భారత పురుషుల హాకీ జట్టు
Next articleచికెన్ పాక్స్ లా వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియెంట్ : అమెరికా అధ్యయనంలో వెల్లడి