Home జాతీయ వార్తలు శశిథరూర్ పై అభియోగాలు కొట్టివేసిన ఢిల్లీ కోర్టు

శశిథరూర్ పై అభియోగాలు కొట్టివేసిన ఢిల్లీ కోర్టు

404
0
Years Of Torture
Years Of Torture": Shashi Tharoor After Verdict On Wife's Death

శశిథరూర్ పై అభియోగాలు కొట్టివేసిన ఢిల్లీ కోర్టు తన భార్య సునంద పుష్కర్ మరణానికి సంబంధించిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ అనుకూలంగా ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. శశి థరూర్‌పై ఢిల్లీ పోలీసులు క్రూరత్వానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. శశి థరూర్ పై అభియోగాలు మోపడానికి కోర్టు నిరాకరించింది. మాజీ కేంద్ర మంత్రిని అన్ని ఆరోపణల నుండి తొలగించింది.

2014 జనవరి 17న అప్పటి కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ (51) ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్‌లో శవమై కనిపించింది. ఎంపీ ఇల్లు పునర్నిర్మాణం జరుగుతుండటంతో ఆమె హోటల్‌లో బస చేసింది. ఈ ఘటనలో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498 ఏ (వైవాహిక క్రూరత్వం), 306 (ఆత్మహత్యకు ప్రేరణ) కింద శశి థరూర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తన చార్జిషీట్‌లో ఆరోపించారు. అయితే, అతడిని అరెస్ట్ చేయలేదు. 2018 జులై 5న థరూర్‌కు బెయిల్ మంజూరు అయింది.

తనపై ఆరోపణల విషయంలో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు. “చాలా కృతజ్ఞతలు, మీ గౌరవం. ఇది ఏడున్నర సంవత్సరాల సంపూర్ణ హింస నుంచి విముక్తి లభించింది ” ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవిక విచారణలో ఉత్తర్వు జారీ చేసిన న్యాయమూర్తి గీతాంజలి గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఆరోపణలను ‘అసంబద్ధం’ గా శశి థరూర్ అభివర్ణించారు.

“ఇది నా దివంగత భార్య సునంద యొక్క విషాదకరమైన మరణం తర్వాత నన్ను చుట్టుముట్టిన సుదీర్ఘమైన పీడకలకి ఒక ముఖ్యమైన ముగింపును తెస్తుంది. భారతీయ న్యాయవ్యవస్థపై నా విశ్వాసం కారణంగా నేను పదుల సంఖ్యలో నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కొన్నాను”అని శశి థరూర్ అన్నారు. తన న్యాయవాది, వికాస్ పహ్వా, గౌరవ్ గుప్తాలకు కృతజ్ఞతలు తెలిపాడు.

Previous articleత్వరలో హోండా ఎన్ఎక్స్ 200
Next articleసెప్టెంబర్ 10న దసరా కానుకగా ‘లవ్ స్టోరీ’