Home జాతీయ వార్తలు వైద్య విద్య అడ్మిషన్లలో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ లకు రిజర్వేషన్లు : కేంద్రం

వైద్య విద్య అడ్మిషన్లలో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ లకు రిజర్వేషన్లు : కేంద్రం

530
0
27% OBC, 10% EWS reservation in All India Quota for medical education
27% OBC, 10% EWS reservation in All India Quota for medical education

ఎంబిబిఎస్, ఎండీ, ఎంఎస్ అడ్మిషన్లలో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ లకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒబిసి వారికి 27 శాతం, ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్లను ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22 నుంచి అమలు కానున్నాయి. దాదాపు 5,550 మంది విద్యార్థులు దీని నుండి ప్రయోజనం పొందనున్నారు. పిఎం నరేంద్ర మోడీ జూలై 26 న సమావేశం నిర్వహించి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారాన్ని కల్పించాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించారు.
వైద్య విద్యలో కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్ల ద్వారా ఎంబిబిఎస్ లో దాదాపు 1500ల మంది ఓబిసి విద్యార్థులు, 550 ఇడబ్ల్యుఎస్ విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. పిజి వైద్య విద్య ప్రవేశాల్లో 2500ల మంది ఓబిసి విద్యార్థులు, 1000 మంది ఇడబ్ల్యుఎస్ లబ్ది పొందుతారు. ఆల్ ఇండియా కోటా పథకం 1986 లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రవేశపెట్టబడింది. ఒక రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మరొక రాష్ట్రంలో ఉన్న మంచి వైద్య కళాశాలలో చదువుకోవాలనుకునే ఆశయాన్ని నెరవేర్చేందుకు ఇది దోహదపడనుంది. 2007 వరకు ఆలిండియా కోటా పథకంలో రిజర్వేషన్లు లేవు. 2007లో సుప్రీంకోర్టు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఆలిండియా కోటాలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది.
సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ (రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్) చట్టం 2007 లో ఓబీసీలకు ఏకరీతి 27% రిజర్వేషన్లను అందించేటప్పుడు, అన్ని కేంద్ర విద్యా సంస్థలలో కూడా ఇది అమలు చేయబడింది.

Previous articleపెగాసస్ కార్యాలయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం తనిఖీలు
Next articleసెమీస్ కు దూసుకెళ్లిన లవ్లీనా.. భారత్ ఖాతాలో మరో పతకం ఖాయం!