Home సినిమాలు ల‌క్ష్మీరాయ్ గ్లామ‌ర్ ఫొటోల‌పై నెటిజ‌న్లు మండిపాటు

ల‌క్ష్మీరాయ్ గ్లామ‌ర్ ఫొటోల‌పై నెటిజ‌న్లు మండిపాటు

107
0

ల‌క్ష్మీరాయ్ గ్లామ‌ర్ ఫొటోల‌పై నెటిజ‌న్లు మండిపాటు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకు వచ్చిన పేరు కంటే ఐటంసాంగ్ గర్ల్ గా వచ్చిన పేరే ఎక్కువ.  లక్ష్మిరాయ్ అనేగానే తెలుగు సినిమా అభిమానులకు చిరంజీవి ఖైది నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు ఒసిసి రత్తాలు అనే పాట గుర్తుకు రాక తప్పదు. ఐటంసాంగ్ గర్ల్ గా చాలా సినిమాల్లో చేసిన లక్ష్మీరాయ్, రాఘవ లారెన్స్ తో కలిసి కాంచన మూవీలో గ్లామర్ హీరోయిన్ గా అందాలను ఆరబోసిన, ఆ తరువాత ఆశించిన రీతిలో సినిమా అవకాశాలు రాలేకపోయాయి. దాంతో కొంత కాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఆ తరువాత సినిమా అవకాశాలు ఐటంసాంగ్ రూపంలో వచ్చాయి. ఆఫర్ వచ్చిన ఏ ఒక్క సినిమాని వదలకుండా అన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్తుండేది.

కరోనా సెకండ్ వేవ్ రావ‌డంతో ప్ర‌స్తుతం అంద‌రిలాగే ఇంటికే ప‌రిమిత‌మైంది. ఇంట్లో ఖాళీగా ఉండటంతో ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో త‌ర‌చూగా ఏదో ఈవెంట్ చేసుకుంటూ ఫొటోలు షేర్ చేస్తుంది. స్వ‌స్థ‌లం బెల్గాం, చెన్నైలో క‌రోనా విల‌య‌తాండం చేస్తుంటే అవేవీ ప‌ట్ట‌న్న‌ట్లు త‌న ఫొటోలు త‌న ఫంక్ష‌న్ల‌కు సంబంధించిన వివ‌రాలు.. కేక్‌లు క‌ట్‌చేస్తూ, మ‌ద‌ర్స్ డే నాడు ర‌క‌ర‌కాల ఫంక్ష‌న్ల పేరుతో ఫొటోలు షేర్ చేయ‌డంతో ఇవ‌న్నీ ఈ ప‌రిస్థితుల‌లో అవ‌స‌ర‌మా! అంటూ నెటిజ‌న్లు మండిప‌తున్నారు. సినిమాలు లేక‌పోవ‌డంతో సోష‌ల్‌మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుని డ‌బ్బులు ఆర్థించేందుకు చేస్తున్న ప్లానా అంటూ చుర‌క‌లు వేశారు.  

Previous articleకరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజినీకాంత్
Next articleవంటికి మట్టి మేలు, బురదతో ఆకట్టుకున్న పూనమ్ కౌర్