Home సినిమాలు లూసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ ?

లూసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ ?

536
0
Salman Khan acting with Chiranjeevi in Lucifer Remake
Salman Khan acting with Chiranjeevi in Lucifer Remake

లూసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ ? కొరటాల శివ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ‘ఆచార్య’ విడుదల కోసం ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కోసం దర్శకుడు మోహన్ రాజాతో కలిసి ప్రాజెక్టు పై దృష్టి సారించారు. తాత్కాలికంగా చిరు 153 అని దీనికి పేరు పెట్టారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించనున్నారనే వార్తలు ఫిలిం నగర్ లో షికార్లు చేస్తున్నాయి. స్టార్ నటుడు త్వరలో షూటింగ్ సెట్స్‌లో చేరే అవకాశం కనిపిస్తోందంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అలాగే సల్మాన్ ఖాన్ రాకను చిరంజీవి త్వరలో ప్రకటించాలని యోచిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ను లూసిఫర్ ఒరిజినల్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తిరిగి చేస్తాడని తెలుస్తోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో నయనతార మరియు సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. తమన్ ఎస్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎన్‌వి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

సినిమాకు సంబంధించి చిరంజీవి లుక్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాతృకలో మోహన్ లాల్ కి జోడీగా ఎవరినీ పెట్ట లేదు. అయితే తెలుగు ప్రేక్షకులు, అభిమానుల దృష్ట్యా కథలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా, చివరికి ఎవరి పేరు ఖరారైందో తెలియని పరిస్థితి నెలకొంది. మాతృకలో మంజు వారియర్ చేసిన పాత్రనే తెలుగులో నయనతార చేయనున్నట్లు వినికిడి. ఏదేమైనా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు చిరంజీవి లూసిఫెర్ లుక్ లో అభిమానులు మెచ్చేలా రూపొందించాలని మేకర్స్ దృష్టిలో పెట్టుకున్నారు. మాతృకను మించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను మేకర్స్ రూపొందించనున్నారు.

Previous articleఒబిసి బిల్లులో మార్పులు అవసరం : శరద్ పవార్
Next articleతాలిబన్ అనుకూల పోస్టులపై ఫేస్ బుక్ నిషేధం