Home అంతర్జాతీయ వార్తలు ర్యాన్సమ్ వేర్… పుతిన్ – జో బైడెన్ వార్

ర్యాన్సమ్ వేర్… పుతిన్ – జో బైడెన్ వార్

146
0
Joe Biden and Putin
Joe Biden and Putin

రష్యా కు చెందిన హ్యాకర్లు అమెరికాతో పాటు పలు దేశాలకు ర్యాన్సమ్ వేర్ ద్వారా సమాచారాన్ని తస్కరించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు బైడెన్ ఫోన్ చేశారు. ర్యాన్సమ్ వేర్ ద్వారా రష్యాకు చెందిన నేరస్థులు ప్రపంచ దేశాలలో హ్యాకింగ్ పాల్పడుతున్నారని, దీనిని అరికట్టాలంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంపై వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది.
రష్యా దేశం నుంచి వెలువడే ర్యాన్సమ్ వేర్ దాడుల యొక్క పరిణామాలను గమనిస్తున్నామని, ఈ నేరానికి పాల్పడిన సమూహాలపై మాస్కో చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారని ఆ ప్రకటనలో ఉంది. అమెరికా, ప్రపంచంలోని ఇతర దేశాలపై రష్యా హ్యాకర్లు ర్యాన్సమ్ వేర్ దాడులు కొనసాగించడం సహించబోమని జో బైడెన్ చెప్పారు.

దీనిపై వైట్ హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఆ దాడులను రష్యానే చేయిస్తుందని భావించలేమని, అయితే రష్యాకు చెందిన హ్యకర్లే ఈ పని చేస్తున్నట్లు తాము బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. తమ హెచ్చరికలను మాస్కో పరిగణనలోకి తీసుకుంటుందని బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని ప్రభావితం చేసేలా మరొక దేశంలో ఏదో జరుగుతోందని అమెరికన్లు భావిస్తున్నారని, అయితే తాము కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హ్యాకర్ల నుంచి నిరంతర సవాలును ఎదుర్కొంటున్నప్పుడు, అమెరికా తన ప్రజలను, వారి మౌలిక సదుపాయాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని బైడెన్ స్పష్టం చేశారు. ఈ ముప్పును ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు, ఏజెన్సీలను తమ రక్షణ వ్యవస్థలను ఆధునీకరించాలని బైడెన్ పిలుపునిచినట్లు ఒక సీనియర్ పరిపాలన అధికారి పాత్రికేయులకు తెలిపారు.

Previous articleసినీ క్రిటిక్ కత్తి మహేష్ కన్నుమూత
Next articleయూపీలో పిడుగుల వర్షం.. మృతుల సంఖ్య ఎంతంటే…