Home Covid 19 రోజువారీ కోవిడ్ కేసులలో తగ్గుదల

    రోజువారీ కోవిడ్ కేసులలో తగ్గుదల

    405
    0
    Corona Cases in Last 24 Hours in India
    Corona Cases in Last 24 Hours in India

    రోజువారీ కోవిడ్ కేసులలో తగ్గుదల గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ కేసుల తగ్గుదల ప్రజలకు ఊరటనిస్తోంది. కోవిడ్ -19 కోసం జరిపిన పరీక్షల్లో 35,499 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

    దీంతో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య అధికారికంగా 3,19,69,954కు చేరింది. గడిచిన రోజులో 447 మంది తాజాగా మరణించడంతో ఇప్పటి వరకు మహమ్మారి బారిన పది మరణించిన వారి సంఖ్య 4,28,309 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.


    కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం యాక్టివ్ కేసుల సంఖ్య 4,02,188 కు తగ్గింది. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.39 శాతానికి మెరుగుపడింది. 24 గంటల వ్యవధిలో క్రియాశీల కోవిడ్ -19 కేసుల నమోదులో 4,634 కేసుల తగ్గుదల కనిపించింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,11,39,457 కు పెరిగింది.

    అయితే మరణాల రేటు 1.34 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.


    ఆదివారం దేశంలో 13,71,871 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఇప్పటివరకు మొత్తం పరీక్షల సంఖ్య 48,17,67,232 కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా నమోదైంది. గత 14 రోజులుగా ఇది మూడు శాతం కంటే తక్కువగా ఉందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    మొత్తంగా, సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 50.86 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి.


    భారతదేశంలో కోవిడ్ -19 సంక్రమణ సంఖ్య గత సంవత్సరం ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది.

    అక్టోబర్ 29న లక్ష, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న ఒక కోటి, మే 4 న రెండు కోట్ల కేసులు, జూన్ 23న మూడు కోట్ల దారుణ మైలురాయిని దేశం దాటింది.
    447 కొత్త మరణాలలో మహారాష్ట్ర నుండి 151 మరియు కేరళ నుండి 93 ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,28,309 మరణాలు నమోదయ్యాయి, మహారాష్ట్ర నుండి 1,33,996, కర్ణాటక నుండి 36,793, తమిళనాడు నుండి 34,317, ఢిల్లీ నుండి 25,066, ఉత్తర ప్రదేశ్ నుండి 22,773, పశ్చిమ బెంగాల్ నుండి 18,229 మరియు కేరళ నుండి 17,747గా మరణాలు నమోదయ్యాయి.

    70 శాతానికి పైగా మరణాలు కొమొర్బిడిటీల(బిపి, డయాబెటిస్, మానసిక ఆందోళన, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు) కారణంగా సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

    For More News

    Previous articleHealth Benefits Of Tippa Teega
    Next articleHealth Ben fits of Mango Fruit