Home అంతర్జాతీయ వార్తలు రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ రద్దుకు కేంద్రం మొగ్గు

రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ రద్దుకు కేంద్రం మొగ్గు

525
0
Retrospective Tax scrapped by the government
scrapped by the government

రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ రద్దుకు కేంద్రం మొగ్గు: వివాదాస్పద రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ ను కేంద్రం మొగ్గు చూపుతోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం లోక్ సభలో పన్ను చట్టాలు (సవరణ) బిల్లు-2021 ను ప్రవేశపెట్టింది. టెలికాం ఆపరేటర్ వోడోఫోన్, ఎనర్జీ దిగ్గజం కైర్న్‌తో సహా రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌పై వివాదాలలో కంపెనీలకు రీఫండ్ చేయాలని భారత ప్రభుత్వం గురువారం ప్రతిపాదించింది. 2012 మే నెలకు ముందు భారతీయ ఆస్తుల పరోక్ష బదిలీ కోసం పెంచిన పన్ను కోసం పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవడం, షరతులను నెరవేర్చడమే దీని ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. 2012 లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వొడాఫోన్, కైర్న్ వంటి కొన్ని కంపెనీలపై మూలధన లాభాల పన్నును విధించాలని నిర్ణయించింది. ఈ కేసులు విదేశీ పెట్టుబడిదారుల మధ్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కోర్టు తీర్పు ఇచ్చింది. 20 మిలియన్ యూరోలకు పైగా విలువైన భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తులను స్తంభింపజేయాలని, భారత ప్రభుత్వం బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది.
తమకు చెల్లించాల్సిన మొత్తం హామీలో భాగంగా భారత ప్రభుత్వానికి చెందిన ఉన్న ఆస్తులను స్తంభింపజేయాలని ప్యారిస్ కోర్టు ఆదేశించినట్లు కైర్న్‌ సంస్థ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, నెదర్లాండ్స్, సింగపూర్ మరియు కెనడాలోని కోర్టులలో భారతదేశానికి వ్యతిరేకంగా కూడా ఇదే తరహా వాదనలను చేసినట్లు కెయిర్న్ తెలిపింది. భారతదేశంలో చమురు మరియు గ్యాస్ కార్యకలాపాలను కలిగి ఉన్న కైర్న్‌కు, హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం డిసెంబర్‌లో దాదాపు 1.2 బిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారాన్ని, వడ్డీ, కోర్టు ఖర్చులను భారత్ చెల్లించాలని ప్రకటించింది. గత సంవత్సరం సెప్టెంబరులో వోడాఫోన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో 2 బిలియన్ డాలర్ల పన్ను క్లెయిమ్‌పై భారతదేశానికి వ్యతిరేకంగా కేసును గెలుచుకుంది. ట్రిబ్యునల్ తీర్పుతో నెదర్లాండ్స్‌ తో పెట్టుబడుల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని తేల్చింది. వొడాఫోన్ ఇండియా జాయింట్ వెంచర్ అయినా వోడాఫోన్ ఐడియా నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా సంస్థ నుంచి వైదొలిగారు. టెలికాం క్యారియర్‌లో తన ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క 27 శాతం వాటాను విక్రయించడానికి జూన్‌లో మిస్టర్ బిర్లా ప్రకటించడంతో రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌పై విధానాన్ని ప్రభుత్వం పరిశీలించింది.

For Latest News

Previous articleపెగాసస్.. సుప్రీంను ఆశ్రయించిన యశ్వంత్ సిన్హా
Next articleపులిచింతలకు నిపుణుల బృందం.. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు