Home సినిమాలు రాధే శ్యామ్ విడుదలయ్యేది అప్పుడు కాదా?

రాధే శ్యామ్ విడుదలయ్యేది అప్పుడు కాదా?

445
0
Prabhas Radhe Shyam Movie Release Date Change
Prabhas Radhe Shyam Movie Release Date Change

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకునిగా రూపొందుతున్న చిత్రం ‘రాధే శ్యామ్’ విడుదలయ్యే తేదీ మారినట్లు సమాచారం. ఈ చిత్రం విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కే సినిమాలన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలాగానే రూపొందుతున్నాయి.
ఈ కోవలో అందాల భామ పూజ హెగ్డే ప్రభాస్ తో ఈ సినిమాలో జత కట్టింది. ఈ పాన్ఇండియన్ చిత్రం అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అన్నీ బాగుంటే ఈ సినిమాను అంతా రెండు రోజుల్లో వీక్షించే వారు. ఈ తరుణంలో తాము రాధే శ్యామ్ సినిమాను జులై 30న విడుదల చేయడం లేదని చిత్ర వర్గాలు అధికారికంగా చెప్పాయి. కరోనా మహమ్మారి కారణంగా, జూలై 30 న థియేటర్లలోకి రావాల్సిన చిత్రం ఆలస్యం అయింది.

ఇప్పటి వరకు మాస్, క్లాస్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ తొలి సారిగా సైన్స్ ఫిక్షన్ మూవీ ద్వారా అలరించనున్నాడు. ప్రచార చిత్రాల్లో కనిపించినట్లుగా ఓ ట్రైన్ లో హీరోయిన్ తో ప్రయాణించే క్రమంలో గుహ దాటే క్రమంలో గత జన్మ స్మృతుల్లోకి వెళ్తారని తెలుస్తోంది. దీంతో తమ అభిమానం హీరో వైవిధ్య చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్నారు. పలు రాష్ట్రాలలో కోవిడ్ సడలింపులు ఇచ్చినప్పటికీ థియేటర్లు నిర్వహణ కోసం వాటి యజమానులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోవిడ్ దృష్ట్యా పరిస్థితులు కొంచెం చక్కపడ్డాక ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు యోచిస్తున్నారని తెలుస్తోంది.

Previous articleప్రతిపక్షాలతో రాహుల్ గాంధీ సమావేశం
Next articleయుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ భారత పర్యటన