Home సినిమాలు రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ

రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ

374
0
Bombay HC rejects Raj Kundra’s plea challenging arrest
Bombay HC rejects Raj Kundra’s plea challenging arrest

రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వేసిన బెయిల్ పిటిషన్ ను బొంబాయి హైకోర్టు శనివారం తోసిపుచ్చింది.

మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ, తనను కస్టడీ నుండి విడుదల చేయాలంటూ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, ఆయన సహచరుడు ర్యాన్ థోర్ప్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

వారి పిటిషన్లను బొంబాయి హైకోర్టు శనివారం కొట్టేసింది. పిటిషనర్లను అరెస్టు చేయడం, కస్టడీకి తీసుకురావడం చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందని హైకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్ కోర్టు విషయంలో ఎలాంటి జోక్యం అవసరం లేదని తెలిపింది.

అడల్ట్ ఫిల్మ్స్ కేసులో అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కుంద్రా చేసిన పిటిషన్లను కోర్టు ఆగస్టు 2న తీర్పును రిజర్వ్ చేసింది. కుంద్రా, థోర్పేలు కేసును రద్దు చేయాలని కోరుతూ, మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించారు. జస్టిస్ ఏఎస్ గడ్కరీ ధర్మాసనం కుంద్రా పిటిషన్‌ను విచారించింది.

ముంబై పోలీసుల తరుపున చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ పాయ్ వాదనలను కొనసాగించారు. వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, స్టోరేజ్ ఏరియా నెట్‌వర్క్ లో దొరికిన మెటీరియల్‌తో పాటుగా నిందితుల నుండి 68 అశ్లీల సినిమాలు స్వాధీనం చేసుకున్నట్లు బెంచ్‌కు తెలిపింది.

నిందితులు మొబైల్ ఫోన్ యాప్ లు హాట్‌షాట్‌, బోలీఫేమ్‌లలో పోర్న్ స్ట్రీమింగ్‌ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కుంద్రా మరియు తోర్పే తమ వ్యక్తిగత ఫోన్లు, కంప్యూటర్ల నుండి నేరపూరిత కంటెంట్‌ను తొలగించారని పోలీసుల తరుపు న్యాయవాది వాదించారు. నిందితులు సాక్ష్యాలను నాశనం చేస్తున్నప్పుడు పోలీసులు ప్రేక్షకులుగా ఉండలేరని, దానిని నిరోధించడానికి వారిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద అనవసరమైన అరెస్టును నివారించడానికి పోలీసు అధికారి ముందు హాజరు కావాలని సెక్షన్ 41 ఏ కింద కుంద్రా, థోర్పేకి నోటీసు అందజేసినట్లు కూడా పాయ్ చెప్పారు. థోర్ప్ నోటీసును స్వీకరించగా, కుంద్రా తిరస్కరించారని ఆమె తెలిపారు.
కుంద్రా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఆబాద్ పోండా మాట్లాడుతూ, భారతీయ శిక్షాస్మృతి కింద సెక్షన్ 201 (సాక్ష్యం అదృశ్యమైనందుకు శిక్ష) కొత్త ఆరోపణగా వాదించారు.

నిందితుడికి సమాచారం ఇవ్వకుండా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దానిని చేర్చినట్లు చెప్పారు. కుంద్రా డేటాను తొలగిస్తుంటే, మొదటి రిమాండ్‌లో పేర్కొనే వారని, కానీ అది జరగలేదని అన్నారు. అరెస్టు చేసిన రాత్రి డేటాను తొలగించినట్లు చూపించడానికి ఎలాంటి ఆధారం లేదని ఆయన అన్నారు. అరెస్టు చేసినప్పుడు 22 మంది పోలీసు సిబ్బంది ఉన్నారని చెప్పారు.

తోర్పే తరఫున న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ కూడా తన క్లయింటు పోలీసు నోటీసును అంగీకరించినప్పటికీ, అరెస్టు చేశారన్నారు. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని వాదించారు. అన్ని వాదనలను విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వలేమని పేర్కొంటూ, ఆగస్టు 2న తీర్పు రిజర్వు చేసింది.

For Latest Posts

Previous articleబాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్.. అర్ధరాత్రి ముంబైలో విస్తృత తనిఖీలు
Next articleజాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి