Home క్రీడలు రాజీవ్ ఖేల్ రత్న.. ఇక నుంచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న : ప్రధాని మోడీ

రాజీవ్ ఖేల్ రత్న.. ఇక నుంచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న : ప్రధాని మోడీ

566
0
Rajiv Gandhi Khel Ratna Award Renamed After Hockey Great Dhyan Chand
Rajiv Gandhi Khel Ratna Award Renamed After Hockey Great Dhyan Chand

రాజీవ్ ఖేల్ రత్న.. ఇక నుంచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న : ప్రధాని మోడీ భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. క్రీడా రంగంలో అత్యున్నత అవార్డుకు పేరు మార్పు హాకీ క్రీడా దిగ్గజం ధ్యాన్ చంద్ కు తగిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు. అయితే ప్రధాని చర్యను పలువురు ప్రశంసిస్తూనే, కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశారు. ప్రాథమిక స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం లేకపోతే అవార్డుకు పేరు మార్పుతో ఏ ఉపయోగం ఉండదని కొందరు పేర్కొన్నారు.
ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని భారత దేశ వ్యాప్తంగా పౌరుల నుండి అనేక అభ్యర్ధనలు వచ్చాయని ప్రధాని మోడీ చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. వారి మనోభావాలను గౌరవిస్తూ, ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్పు చేసినట్లు వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు తమ ప్రదర్శనతో యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకుంది. మహిళల హాకీ జట్టు శుక్రవారం ఒలింపిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ పోరులో పోరాడి ఓడింది. గురువారం పురుషుల హాకీ జట్టు 41 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకుంది. ఈ క్రమంలో పురుషుల, మహిళల హాకీ జట్లు ప్రదర్శించిన అసాధారణ ఆటతీరు దేశాన్ని ఆకర్షించింది. ఒలింపిక్స్ లో మన హాకీ జట్లు రాణింపు రాబోయే కాలంలో ఇది చాలా సానుకూల సంకేతం అం అవార్డుకు కొత్త పేరు ప్రకటించే ముందు ప్రధాని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. దేశం తరుపున మూడు ఒలింపిక్ స్వర్ణాలు గెలవడంతో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, మాజీ హాకీ కెప్టెన్ అజిత్పాల్ సింగ్ ప్రకటన చేశారు. ధ్యాన్ చంద్ కు గుర్తింపు ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఇది ఎన్నడూ లేనంత మెరుగైనదని పేర్కొన్నాడు.ఇది స్వాగతించదగిన చర్య అని, ప్రధాన మంత్రి తీసుకున్న మంచి నిర్ణయం అని అభివర్ణించారు. క్రీడా పురస్కారాలు ఎల్లప్పుడూ క్రీడాకారుల పేరిట ఉండాలని ఆయన చెప్పారు. దేశంలో ధ్యాన్‌చంద్ ని మించిన పెద్ద క్రీడాకారుడు లేరని కొనియాడారు. ఇదిలా ఉండగా ధ్యాన్ చంద్ ను గౌరవించడం మంచి చర్య అని ఒలింపిక్ కాంస్య విజేత బాక్సర్ విజేందర్ సింగ్ అన్నారు. అది ఒక్కటే సరిపోదని, కానీ క్రీడాకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ చేయాలని కోరారు. వారికి ప్రాథమిక స్థాయిలో సౌకర్యాలు అవసరమని గుర్తించాలని, అలా చేయలేకపోతే, అవార్డుల పేరు మార్చడం వల్ల పెద్దగా తేడా ఉండదని వ్యాఖ్యానించారు.
1991-92లో ప్రారంభించిన ఈ పురస్కారంతో మెడల్, సర్టిఫికెట్, రూ. 25 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ఖేల్ రత్న అవార్డును చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ మొదటగా అందుకున్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ అవార్డు అందుకున్న వారిలో క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ తదితరులు ఉన్నారు.

For latest News

Previous articleరైతుల నిరసనలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు
Next articleగోగ్రా స్థావరం నుంచి వైదొలగనున్న భారత్-చైనా దళాలు