Home జాతీయ వార్తలు రాకేష్ ఆస్థానా మాకొద్దు.. ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం

రాకేష్ ఆస్థానా మాకొద్దు.. ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం

385
0
Rakesh Asthana Appointed as Delhi Police Commissioner
Rakesh Asthana Appointed as Delhi Police Commissioner

ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా రాకేష్ ఆస్థానాను కేంద్రం నియమించడంపై ఢిల్లీ ప్రభుత్వం మండిపడింది. ఆయన తమకు వద్దంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఢిల్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భయోత్పాతాన్ని సృష్టించడానికే రాకేష్ ఆస్థానాను ఇక్కడికి పంపిందంటూ ఢిల్లీ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని క్లుప్త చర్చ తర్వాత ఆమోదించారు. చర్చ సందర్భంగా ఢిల్లీ హోంమంత్రి సత్యేందర్ జైన్ సహా ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు అస్తానాపై మాటల దాడి చేశారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బిజెపికి చెందిన రామ్‌వీర్ సింగ్ బిధురి మాత్రం ఆస్తానా నియామకంపై కేంద్రాన్ని ప్రశంసించారు.

పదవీ విరమణకు ముందు కనీసం ఆరు నెలల సర్వీసు మిగిలి ఉన్న అధికారులను మాత్రమే డైరెక్టర్ జనరల్ పోలీస్ పోస్టుకు పరిగణించాలని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇది ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సందర్భంగా 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించినట్లు ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అక్టోబర్ 2018లో సిబిఐ స్పెషల్ డైరెక్టర్ పదవి నుండి కేంద్ర ప్రభుత్వమే తొలగించిందని, ఇటీవల సిబిఐ డైరెక్టర్ పదవికి తగిన వ్యక్తిగా పరిగణించబడని వివాదాస్పద అధికారిని ఢిల్లీ కమిషనర్ గ ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. ఈ అధికారి గత ట్రాక్ రికార్డ్ చూస్తే, జాతీయ రాజధానిలో భీభత్సం పాలనను సృష్టించడానికి, రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులను వేయడానికి కేంద్ర ప్రభుత్వం అతన్ని ఉపయోగిస్తుందనే భయం తమకుందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. అలాంటి వివాదాస్పద వ్యక్తి దేశ జాతీయ రాజధానిలో పోలీసు బలగాలకు నాయకత్వం వహించకూడదని తీర్మానంలో ఢిల్లీ ప్రభుత్వం పొందుపరిచింది.

Previous articleగోవా గ్యాంగ్ రేప్.. సిఎం వ్యాఖ్యలపై దుమారం
Next articleపెగాసస్ కార్యాలయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం తనిఖీలు