Home జాతీయ వార్తలు యూపీలో పిడుగుల వర్షం.. మృతుల సంఖ్య ఎంతంటే…

యూపీలో పిడుగుల వర్షం.. మృతుల సంఖ్య ఎంతంటే…

119
0
Nearly 60 people died by Lightning in U.P, Rajasthan
Nearly 60 people died by Lightning in U.P, Rajasthan

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో మహిళలు, పిల్లలు సహా దాదాపు 38 మంది మృతి చెందారు. మరణాలలో ఎక్కువ భాగం ప్రయాగ్ రాజ్ జిల్లాలో నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల్లో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వర్షం కారణంగా పశువులను కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రధాని మంత్రి కార్యాలయం కూడా స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికీ రూ.50 వేల చొప్పున ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి అందించనున్నట్లు తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మరణాలు సంభవించాయి. వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలో 14 మరణాలు నమోదు కాగా, కాన్పూర్, ఫతేపూర్ జిల్లాల్లో ఐదు చొప్పున మరణాలు సంభవించాయి. కౌశాంబి జిల్లాలో నలుగురు మరణించగా, ఫిరోజాబాద్, ఉన్నావ్, రాయ్ బరేలి జిల్లాలలో ఇద్దరు చొప్పున, హర్దోయి, ఝాన్సీ జిల్లాలలో ఒక్కరు చొప్పున అశువులు బాశారు. రాజస్థాన్శలో కూడా వర్షాలకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించనున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
నైరుతి రుతుపవనాలు ఢిల్లీ మీదుగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ లోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించనున్నాయని, రానున్న 24 గంటలలో ఆయా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Previous articleర్యాన్సమ్ వేర్… పుతిన్ – జో బైడెన్ వార్
Next articleజకో.. గోల్డెన్ స్లామ్ సాధిస్తాడా?