Home అంతర్జాతీయ వార్తలు యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ భారత పర్యటన

యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ భారత పర్యటన

274
0
Antony Blinken holds talks with Jaishankar
Antony Blinken holds talks with Jaishankar

భారత పర్యటనలో భాగంగా యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ను ఆయన కలుసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తన బలగాలు ఉపసంహరించుకున్న తర్వాత తాలిబాన్లు ఆ దేశంలో అలజడి సృష్టిస్తుండటంతో ఆ విషయంపై అమెరికా-భారత్ దేశాల విదేశాంగ
ప్రతినిధులు చర్చలు జరిగాయి. బహుళ రంగాలలో ప్రపంచ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ కు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్వాగతం పలికారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ట్వీట్ చేశారు. జైశంకర్‌ను కలవడానికి ముందు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితులతో సహా అనేక ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ సమస్యలపై బ్లింకెన్ చర్చలు జరిపారు.

అంతకుముందు, బ్లింకెన్ పౌర సమాజ నాయకులను కలుసుకున్నారు. అమెరికా మరియు భారతదేశం ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతను పంచుకుంటాయని మరియు ఇది సంబంధాల పెంపునకు దోహదపడుతుందని చెప్పారు. పౌర సమాజ నాయకులను కలుసుకున్నందుకు తాను సంతోషిస్తున్నానని, అమెరికా-భారతదేశం పరస్పరం ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతను పంచుకుంటాయని బ్లింకెన్ చెప్పారు. యుఎస్ విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బ్లింకెన్ చేసిన మొదటి భారత పర్యటన ఇది. మంగళవారం సాయంత్రం బ్లింకెన్ న్యూ ఢిల్లీకి చేరుకున్నప్పుడు ఆ దేశ విదేశాంగ శాఖ కీలక ట్వీట్ చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ఆర్థికాభివృద్ధిలో భారతదేశం ఒక ప్రముఖ ప్రపంచ శక్తిగా, కీలక భాగస్వామిగా అవతరించడానికి అమెరికా మద్దతు ఇస్తుందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.
ఆఫ్ఘానిస్తాన్ లో తమ బలగాల ఉపసంహరణ తరువాత పాకిస్థాన్ నుంచి అక్కడకి ఉగ్రవాదులను పంపడం పలు విపత్కర పరిస్థుతలకు దారి తీస్తుందని, ఇది పరోక్షంగా సరిహద్దు దేశం భారత్ పైన పడడంపై వారు చర్చల్లో సంభాషించుకున్నారు. చర్చలలో ఆరోగ్య సంరక్షణ, విద్య, డిజిటల్ డొమైన్లలోని అవకాశాలను చూడటంతో పాటు వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను పెంచే మార్గాలపై భారతదేశం-యుఎస్ కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.

Previous articleరాధే శ్యామ్ విడుదలయ్యేది అప్పుడు కాదా?
Next articleకరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష