Home జాతీయ వార్తలు మోడీ టీంలో యువరక్తం

మోడీ టీంలో యువరక్తం

140
0

2024 లో అధికారమే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రివర్గం రూపు రేఖలు మార్చేందుకు ప్రధాని మోడీ సమయాత్తం అయ్యారు. ముఖ్యంగా తన కేబినెట్ లో యువకులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో వివిధ సామాజిక సమీకరణాలు, వివిధ ప్రాంతాలను పరిగణన లోనికి తీసుకుని మంత్రి మండలి పునర్నిర్మాణానికి మోడీ శ్రీకారం చుట్టారు.

మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో సదానంద గౌడ, రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్, థావర్ చంద్ గెహ్లాట్, హర్షవర్ధన్, సంతోష్ కుమార్ గంగ్వార్, బాబుల్ సుప్రియో, సంజయ్ దొత్రే, రతన్ లాల్ కఠారియా, ప్రతాప్ చంద్ర సారంగీ, దేవశ్రీ చౌదరి లు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో పలు శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు. దీంతో పలు శాఖలకు కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టనున్నారు.

వీరికి ప్రమోషన్
కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపా, హర్దీప్ సింగ్ పూరి, మానుష్ లకు కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ దక్కింది. పనితీరు, వివిధ సమీకరణల ఆధారంగా వీరికి మోడీ తగిన గుర్తింపునిచ్చారు. ఇక వీరితో పాటు నారాయణ్ రాణే, శర్వానంద్ సోనోవాల్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, పశుపతి కుమార్ పరాస్, రాజ్ కుమార్ సింగ్, మన్ సుఖ్ ఎల్ మాండవ్య, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్, సత్య పాల్ సింగ్ భాగేల్, రాజీవ్ చంద్ర శేఖర్, శోభా కరంద్లాజే, భాను ప్రతాప్ సింగ్ వర్మ, మీనాక్షి లేఖి, నారాయణ స్వామితో సహా మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు

Previous articleTikTok రీ ఎంట్రీ?
Next articleఏ… ఒకసారి చెప్తే అర్ధం కాదా? : ప్రకాష్ రాజ్ పై సీనియర్ నరేష్ సెటైర్