Home జాతీయ వార్తలు మైసూరు గ్యాంగ్ రేప్.. సాంకేతికతపై పోలీసుల ఆధారం

మైసూరు గ్యాంగ్ రేప్.. సాంకేతికతపై పోలీసుల ఆధారం

150
0
Mysuru rape: Cops gather technical data to find mobile phones active on crime spot during incident
Mysuru rape: Cops gather technical data to find mobile phones active on crime spot during incident

మైసూరు గ్యాంగ్ రేప్.. సాంకేతికతపై పోలీసుల ఆధారం

ఘటన సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ల కోసం అన్వేషణ

బాధితుల ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగ్గా ఉన్నట్లు పోలీసుల వెల్లడి మైసూరు గ్యాంగ్ రేప్ కేసును ఛేదించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. నేరం జరిగిన ప్రాంతంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లను గుర్తిస్తున్నారు. సెల్ ఫోన్ లొకేషన్ వంటి సాంకేతిక డేటాను ఉపయోగిస్తున్నారు. బాధితురాలి స్నేహితుడి నుండి కూడా పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.

నిందితులు బాధితురాలిని వీడియోలు తీశారని ఆమె స్నేహితుడు పోలీసులకు చెప్పాడు. పోలీసులను ఆశ్రయిస్తే వాటిని బహిరంగపరుస్తామని నిందితులు బెదిరించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మంగళవారం రాత్రి.. మైసూరులోని చాముండి హిల్స్ పర్వత ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి బాధితురాలు తన స్నేహితునితో వెళ్ళింది. తిరిగి వస్తుండగా నలుగురు నిందితులు అటకాయించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, బాధితులు నిరాకరించారు. దీంతో యువకుడిని కొట్టి, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మైసూరులోని అలనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లలితాద్రిపుర ప్రాంతంలోని ఈ ఘటన జరిగింది.

అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ రెడ్డి సంఘటనా స్థలాన్ని గురువారం సందర్శించారు. 2013 జూన్ లో, మణిపాల్ యూనివర్శిటీలో ఒక వైద్య విద్యార్థిపై ఇదే రీతిలో అఘాయిత్యం జరిగింది. అప్పుడు కూడా సెల్ ఫోన్ టవర్ ఆధారంగా కేసులు ఛేదించారు. అప్పుడు పశ్చిమ ఐజిపి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

మణిపాల్ యూనివర్సిటీ ఘటనలో.. 22 ఏళ్ల మెడికల్ విద్యార్థినిని క్యాంపస్ నుండి అపహరించారు. ఒంటరి ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 2013 జూన్ 20 రాత్రి సెల్ ఫోన్ లొకేషన్ డేటాను పోలీసులు విశ్లేషించారు. ఈ కేసులో ఐదుగురు స్థానికుల ప్రమేయాన్ని గుర్తించి, వారిని అరెస్టు చేశారు.

ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. మైసూరు సంఘటనలో, అనుమానితులు బాధితురాలి స్నేహితుడిపై దాడి చేశారు. అతడిని నిస్సహాయుడిని చేసి, యువతిని చెరబట్టారు. ఈ ముఠా తొలుత బాధిత జంట నుంచి డబ్బులు డిమాండ్ చేసి, ఆపై యువతిపై లైంగికదాడికి పాల్పడింది.

దాడి జరిగిన ప్రాంతాన్ని తరచుగా సందర్శించే వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానితుల గురించి స్థానికులను, వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సంఘటన తర్వాత.. అక్కడి నుంచి పారిపోయే ముందు బాధితుల మొబైల్ ఫోన్లను నిందితులు లాక్కున్నారు. బాధితులు భయానక ఘటన నుంచి ఇంకా కోలుకోలేదని పోలీసులు చెబుతున్నారు. కానీ బుధవారం కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో మద్యం సీసాలు కనిపించాయి. అనుమానితుల కోసం పోలీసులు మద్యం దుకాణాల వద్ద కూడా ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు రోడ్డు పక్కన నాలుగు బైక్‌లు పార్క్ చేసినట్లు ఒక సాక్షి చెప్పారు. నేరం జరిగిన ప్రదేశం చీకటిగా ఉంటుంది. ఇదే అదునుగా ఈ ప్రాంతంలో కొన్ని దోపిడీలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది

Previous articleSmall Business Management Software – Determining the right Business Management Software For Your Business
Next articleHow to Earn Money Out Of Free Slots Machines